Showing posts with label తత్వశాస్త్రం. Show all posts
Showing posts with label తత్వశాస్త్రం. Show all posts

Thursday 12 January 2017

భారతీయ తత్వశాస్త్రం --27

‌  
          (Indian Philosophy)
           *అవైదికదర్శనాలు.*
 (కొన్ని భౌతిక దర్శనాలు : బౌద్ధ దర్శనం.)
                      *బుద్ధ చరిత్ర.*
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
                   *నమస్కారం.*
     *దానిని ఆచరణలో సాధించుట.*
     బుద్దుడు ఒకసారి దేశపర్యటన చేస్తున్నప్పుడు 'సిగాలా' అనే వర్తకుడు తారస పడ్డాడు.
     అతను నాలుగు దిక్కులకు చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాడు. ఆకాశం వైపు నమస్కరించాడు. నేలమీద పడుకుని నమస్కరించాడు.
     *బుద్దుడు:-* అన్ని నమస్కారాలు ఎందుకు చేస్తున్నావని సిగాలాను బుద్దుడు ప్రశ్నించాడు.
      *సిగాలా:-*"ఏమో, నాకేం తెలుసు. చిన్నప్పుడు మా నాన్న అలా చేయాలని చెప్పాడు. అందుకే ఇలా చేస్తున్నాను. ప్రతిరోజు ప్రాతఃకాలంలో నమస్కారాలు చేయడం నాకు అలవాటు" అని బుద్దునితో అన్నాడు.
     *బుద్దుడు:-*"అలాకాదు సిగాలా! ఏ పని చేస్తున్నా అర్థం, పరమార్థం తెలుసుకుని చేయాలి. లేకపోతే ఫలితం ఉండదు.
      *సిగాలా:-* అలా ఇయితే, నమస్కారాల అర్థం వివరించండి మహాశయా!
     *బుద్దుడు:-*తూర్పు దిక్కుకు నమస్కరిస్తే మన తల్లిదండ్రులకు నమస్కరించినట్లు. మనిషికి తల్లిదండ్రుల ఋణం గొప్పది. అందు వలన రోజు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పవలెను.
      దక్షిణ దిక్కుకు నమస్కరిస్తే గురుపరంపరకు నమస్కరించినట్లు. గురువులను గౌరవించాలి.
      పశ్చిమ దిక్కు నమస్కారం భార్యబిడ్డలపై ప్రేమకు చిహ్నం. భార్యబిడ్డల ఆలనాపాలనా చూడాలి.
      ఉత్తర దిక్కు నమస్కారం బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞత చెప్పడం. బంధుమిత్రులను ఎప్పడూ దూరం చేసుకోకూడదు.
      భూమికి నమస్కారం చేయడమం అంటే సాటివారి ఆదరణకు కృతజ్ఞత తెలపడం.
      ఆకాశం వైపు నమస్కరించడం మన పూర్వీకులైన మహర్షులకు, ప్రస్థుత ఉన్న మహాత్ములకు ఆశీస్సులు కోరుతూ, కృతజ్ఞతలు తెలపడం.
     *సిగాలా:-* నమస్కారం గురించి ఈ విషయాలు నాకు తెలియదు మహాత్మా! వీటి గురించి మరింత వివరణ కోరుతున్నాను.
     *బుద్దుడు:-*మనిషి మంచిగా జీవించడం అవసరం సిగాలా! కేవలం పది నిముషాల పాటు నమస్కారాలు పెడితే చాలదు.
      ముందుగా మంచి మిత్రుల్ని సంపాదించుకోవాలి. అది గొప్ప సంపదగా భావించాలి.
  *ఎవరు మంచి మిత్రుడంటావా...*
     *(1)*నీ దగ్గర ధనం లేక పోయినా నీకు అండగా ఉండేవాడు.
     *(2)*నీవు ఆనందంగా ఉన్నా, విచారంగా ఉన్నా నీవెంట నడిచేవాడు.
     *(3)*నీ విజయంలో, అపజయంలో భాగం పంచుకునేవాడు.
     *(4)* నీ కష్టాలు, బాధలు సానుభూతితో అర్థం చేసుకుని ఊరడించేవాడు.
     *(5)*నీకు సదా మంచి జరగాలని కాంక్షించేవాడు. -- మిత్రుడు.
               జీవితంలో మంచిగా
    జీవించడానికి మరిన్నీ సూత్రాలు.
      (1) మంచి ప్రవర్తన గల వారితో స్నేహం చెయ్యాలి. చెడ్డవారితో చెలిమి చేయకూడదు.
     (2) ఆధ్యాత్మికాభివృద్ధికి, మనశ్శాంతికి అనువైన చోట నివాసముండాలి.
     (3) మంచి సంగతులు నేర్రుకునే అవకాశం ఎప్పుడూ విడిచి పెట్టకూడదు.
     (4) తల్లిదండ్రుల విషయం, భార్యాబిడ్డల విషయం అశ్రద్ద చేయకూడదు.
     (5) ఇతరులతో నీ ఆనందాన్ని పంచు, వారి ఆనందాన్ని నీవు పంచుకోవాలి.
     (6) తాగుడు, జూదం, వ్యభిచారం పూర్తిగా త్యజించాలి.
     (7) వినయం, సచ్ఛీలం, బౌదార్యం, నిరాడంబర జీవితం అలవరచుకోవాలి.
     (8) సదా సత్పురుషుల సాంగత్యం అభిలషించాలి. ఏ మాత్రం అవకాశం ఉన్నా, వారి బోధనలు స్వీకరించి, ఆచరించాలి.
     (9) ధర్మబద్దంగా జీవించడం అలవాటు చేసుకోవాలి.
     (10)  కష్టాలు, బాధలు నివారణ కావడానికి 'ధ్యానం' ఒక్కటే మార్గం. అలవాటు చేసుకుని ప్రతిరోజు ధ్యానం చేయాలి.
       బుద్దుడు ఈ విధంగా సిగాలాకు మంచి మిత్రుడు గురించి, సక్రమ జీవితాచరణంలో పాటించాల్సిన పద్ధతులను గురించి ఉపదేశించాడు.  
                          --- మీ సత్యాన్వేషి .
                            ‌ 

Monday 9 January 2017

లోకం - ధర్మం అంటే ఏమిటి?

‌              భారతీయ తత్వశాస్త్రం ౼ 24
                   (Indian Philosophy)
                       అవైదికదర్శనాలు

      (కొన్ని భౌతిక దర్శనాలు : బౌద్ధ దర్శనం.)
                      బుద్ధ చరిత్ర.
           ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
     

          లోకం - ధర్మం అంటే ఏమిటి?
    

బుద్దుడు ప్రధాన అనుచరుడు ఆనందుడు, భిక్షుల అభ్యర్థన మేరకు, లోకం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకున్నాడు.
    ఆనందుడు పై విషయాలపై ధర్మబోధ చేయాలని బుద్దుని కోరాడు. ఆనందుడు అడగడంలో ఏదో ఆంతర్యం ఉంటుందని బుద్దుడు వెంటనే అంగీకరించారు.
     *బుద్దుడు:-* ఆనందా! ఈ లోకం అనేక ధాతువుల కలయిక. అణువుల సమాహారం. అవి కలసి, రూపొంది, పరిమాణం చెంది, పరిమాణంలో మార్పులకు లోనై నశిస్తుంటాయి.
     అన్ని ధర్మాలు, ఇంద్రియాలు, అభిరుచులు, అనుభూతులు, చేతనలు -- అలా పరిమాణం చెందుతూ నశిస్తుంటాయి. ఏవి శాశ్వతంగా ఉండవు. ప్రతి క్షణం పరిణామం చెందవలసిందే. సూక్ష్మంగా చెప్పాలంటే మార్పు చెందుతూ నశించేది 'లోకం' అనుకోవాలి.
     *ఆనంద్:-* మీరు అనేక సందర్భాలలో చెబుతుంటారు. అన్ని ధర్మాలు శూన్యాలే నని. శూన్యం అంటే ఏమిటి గురుదేవా!
     *బుద్దుడు:-* శూన్యం అనడంలో నా అభిప్రాయం వేటికి మనుగడ లేదని. శాశ్వతంగా నిలబడవని.
     *ఆనందుడు:-* అంటే అన్ని ధర్మాలు శూన్యాలేనా?
     *బుద్దుడు:-* నీవు 'శూన్యం' పైన భావన చేయ్యి. ధ్యానంలో 'శూన్యం' బరువు తెలుస్తుంది. 'శూన్యత' విలువ తెలుస్తుంది. జనన మరణాలను దాటిపోవడానికి శూన్యధ్యానం మించిన సాధనం లేదు.
     *ఆనంద్:-* గురుదేవా! ఇప్పుడు ఈ మందిరం ధ్యానులతో నిండి ఉంది. దీనిని పూర్ణం అనవచ్చు కదా!
     *బుద్దుడు:-* నిండి ఉండడం పూర్ణత్వం అయితే శూన్యంతో నిండి ఉండడం కూడా పూర్ణత్వమే.
     వీళ్ళంతా ధ్యానంలో మైమరిచి పోయినారనుకుందాం. వారికి ప్రపంచ ధ్యాసలేదు. కను వారికి తాము శూన్యమే, ఈ మందిరం శూన్యమే, ప్రపంచం శూన్యమే.
     అన్ని ధర్మాలు నశించేవి అనడంలో అన్ని మార్పులు చెందేవి అని అర్థం. చివరికి ఏవి మిగలవు. శూన్యం అంటే ఆత్మ సైతం మిగలని స్థితి. అది శూన్యం అంటే.
     *ఆనంద్:-* కొందరు వైదికవాదులు, అన్యమతస్థులు బుద్దునిది శూన్యవాదం అని ప్రచారం చేస్తున్నాం. జీవనవాదానికి భిన్నమైనది శూన్యవాదం. అస్తిత్వానికి భిన్నమైనది నాస్తికవాదం. కాదంటరా! ధర్మాలు శూన్యం అంటే అందరికీ కోపం వస్తుంది కదా!
     *బుద్దుడు:-* ఈ విషయంలో పండితులే కాదు యావత్ ప్రపంచం నన్ను అపార్థం చేసుకుంటుంది.
     అన్నీ శూన్యం అని నేనెప్పుడూ చెప్పలేదు. జీవితాన్ని త్రోసి రాజనలేదు. అస్తిత్వాన్ని ఆమోదించేవారు నాస్తికత్వాన్ని ఆమోదిస్తారు. పూర్ణత్వాన్ని ఆమోదించే వారే శూన్యాన్ని ఆమోదిస్తారు.
      అస్తిత్వం ఎన్నటికీ శూన్యం కాదు. కాని చివరికి మిగిలేది శూన్యం. అంటే శూన్యతా భావన. ఒక విధంగా చూస్తే అన్నింటి స్వభావంలో శూన్యం ఉన్నట్లు. మరొక విధంగా విశ్లేషిస్తే అన్ని భ్రమలనిపిస్తాయి. భ్రమవాదం లోనికి వెళితే గాని సత్యం గోచరించదు.
      *భిక్షు కాత్యాయన:-* ఏది సవ్యమైన దృష్టి? ఏది అపసవ్య దృష్టి?
    *బుద్దుడు:-* అపసవ్య దృష్టి అంటే ఆస్తిక, నాస్తిక భావనలు ఏర్పరుచుకోవడం. సవ్యదృష్టి అంటే ఆ రెండింటికీ విలువ ఇవ్వక పోవడం. ఆస్తిక, నాస్తిక భావనలకు దృష్టి దోషం ఉంది. వాస్తవం ఎప్పుడూ సిద్ధాంత, రాద్దాంతాలకు అతీతం. సత్యాన్ని గ్రహించిన వారిని జ్ఞానులు, ప్రాజ్ఞులంటారు.
     *ఆనంద్:-* అంటే అర్థం కాలేదు.
     *బుద్దుడు:-* ఉదాహరనకు ఈ ధర్మమందిరం ముందర ఉన్న బోధివృక్షాన్ని తీసుకో అది ఎప్పుడు పుట్టింది?
     *ఆనంద్:-* నాలుగు సంవత్సారాలై ఉంటుంది.
     *బుద్దుడు:-* నాలుగు సంవత్సరాల క్రిందట అక్కడ బోధి వృక్షం ఉన్నట్లా? లేనట్టా?
     *ఆనంద్:-* లేనట్లే.
     *బుద్దుడు:-* అంటే శూన్యం నుండి బోధి వృక్షం ఉద్భవించిందా? కాదు గదా. అలాగే ఏ ధర్మం అయినా శూన్యం నుండే ఉద్భవిస్తుంది. బీజం ఎక్కడో ఉంటుంది. విత్తనం లేకుండా మొక్క మొలకెత్తదు. మహావృక్షంగా పెరగదు. అది పరిణామం. చెట్టు విత్తనానికి పొడిగింపు. వేళ్ళు నేలలో పాతుకునే వరకు. కొమ్మలు, రెమ్మలు పైకి విస్తరించే వరకు అది బీజంలో ఉన్నట్లే. కాదంటే చెట్టు రూపంలో ఉండదు.
     వేళ్లు నేలలో పాతుకున్నాక విత్తనం చనిపోతుందా? లేదు. విత్తనం లేకుండా పోయింది. విత్తనం రూపం మారింది. పరిణామంలో స్థితి మారింది. ఒక స్థితిలో నుండి మరో స్థితిలోకి మారడం.
     అలాగే మరణంతో మనిషి మరణించడు. పరిణామం చెందుతాడు. మృత్యువు వలన నశించేది ఏది ఉండదు. ప్రాయికమైన ధాతువులు వేటికవి విడిపోతాయి. జీవం ముందుకు సాగుతుంది. అయితే జీవానికి జననం లేదు, మరణం లేదు. ఉన్నది ఒకటే పరిణామం.
                           ---- మీ సత్యాన్వేషి

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles