Showing posts with label నీతి. Show all posts
Showing posts with label నీతి. Show all posts

Thursday 12 January 2017

స్వామి వివేకానందుని స్ఫూర్తి వచనాలు

👬 *జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు*👬


😊 *స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా  దివ్య ప్రబోధాలు*😊


గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగ్రుతులు కండి.

దీర్ఘ (?) అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.



ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.


మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.



మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..

ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.

కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు

మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.


ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది..

Tuesday 10 January 2017

సామ గానం - ఖగోళ జ్ఞానం


శ్రీరంగం ఆలయ గోపుర నిర్మాణ సహాయానికి ముందుగా ఇష్టం వ్యక్తం చేసిన మంత్రాలయ మఠం వారు ఇప్పుడు కాస్త వెనకడుగు వేస్తున్నారని, కాబట్టి ఈ పనికి వేరొకరిని వినియోగించాలి కాబట్టి మరెవరిని అయినా సూచించాలని జీయర్ గారు శ్రీ దేశికన్ ని పరమాచార్య స్వామి వద్దకు పంపించారు. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు.
మహాస్వామివారు నేలపైన గ్రామఫోను బొమ్మ వేసి, పక్కనున్నవారిని సినీప్రముఖుల పేర్లను చెప్పమని సంజ్ఞలతో ఆదేశించారు. అందరి పేర్లూ ఒక్కొక్కటిగా చెబుతున్నారు కాని స్వామివారు ఇంకా ఇంకా అని అడుగుతున్నారు. హఠాత్తుగా ఎవరో నాపేరు చెప్పగానే, నేనే ఆ వ్యక్తి అని స్వామివారు చెప్పారు.
నాకు పరిచయస్తుడైన తిరుచ్చి నివాసి చంద్రమౌళి నాకు ఈ విషయం తెలిపాడు. ఈయన మంచి మృదంగ విద్వాంసుడు. ఒకరోజు సాయింత్రం ఏడు గంటలప్పుడు ప్రాసాద్ స్టూడియో నన్ను కలుసుకొని జరిగిన సంగతి మొత్తం చెప్పాడు.
“శ్రీరంగం ఆలయ గోపురం కట్టించమని నిన్ను ఆదేశించి, నిన్ను స్వామివారు అనుగ్రహించారు” అని చెప్పాడు. ”ఓహ్! పరమాచాఅర్య స్వామివారు ఆదేశించారా? అయితే తప్పక చెయ్యాలి. నేను ఖచ్చితంగా చేస్తాను” అని చంద్రమౌళికి చెప్పాను.
కాని దాని గురించి ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను అప్పటిదాకా స్వామివారిని కలవలేదు. ఈ విషయం గురించి నాకు స్వామివారి వద్ద నుండి కాని, జీయర్ గారి వద్దనుండి కాని ప్రత్యక్షంగా సమాచారం రాలేదు.
“మొత్తం గోపురం ఖర్చు 22 లక్షలు అవుతుంది. కాని స్వామివారు మిమ్మల్ని కేవలం ఆరవ అంతస్తు గురించి మత్రమే మీకు అప్పగించారు. అది దాదాపు 8 లక్షల రూపాయలు అవుతుంది” అని చెప్పాడు. “నేను మొత్తం గోపుర నిర్మాణానికే నా సమ్మతిని తెలిపాను. అంత ధైర్యం నాకు ఎలా కలిగిందో తెలుసా? అది కేవలం మహాస్వామివారి పైన ఉన్న భక్తి మాత్రమే. ఆ బరువు స్వామివారే చూసుకుంటారు. వారు ఏదైనా విషయం చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో నా పాత్ర, ప్రమేయము ఏమి ఉండదు” అని చెప్పాను.
ఆ తరువాత నాకు మహాస్వామి వారిని చూడాలనే కోరిక చాలా బలపడింది. నేను ఈ విషయాన్ని ప్రముఖ చిత్రకారుడు శిల్పికి చెప్పగా నేను కూడా వస్తాను అన్నాడు. మేమిద్దరమూ చంద్రమౌళితో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు మహాస్వామివారు సతారాలో మకాం చేస్తున్నారు.
సతారాకి దగ్గర్లోని మహాగావ్ లో మహాస్వామి వారిని కలిసాను. అది సదూర ప్రాంతం. స్వామివారు గోశాలలో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది. మేము వచ్చినట్టుగా అక్కడి కైంకర్యానికి చెప్పాము. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. మమ్మల్ని స్వామివారి వద్దకు తీసుకునివెళ్ళారు. స్వామివారు సంజ్ఞలతోనే మేమెవరమని అడిగారు. కైంకర్యం మమ్మల్ని ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు. స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించారు. తరువాత వారు కొద్దిగా తల ఇటు తిప్పడంతో వారి కళ్ళను నేను చూడగలిగాను. ఎంతటి దేదీప్యమానమైన ప్రకాశవంతమైన కళ్ళు అవి. నా జీవితంలో అప్పటి దాకా అంతటి అమోఘమైన కళ్ళను నేను చూదలెదు. అవి నాకు ఏమో చేశాయి. ఆ కళ్ళను చూడడంతోనే నేను స్థాణువై నిలబడిపోయాను. రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తూ, నా ప్రమేయం లేకనే కళ్ళ నీరు కార్చాను. కొద్దిసేపు ఒక మామిడి పండును చేతిలో ఉంచుకొని దాన్ని ప్రసాదంగా నాకు ఇచ్చారు. ఎప్పటికి లభించని పెద్ద అనుగ్రహం అది.
స్వామివారు ఆ సాయింత్రం దగ్గర్లోని గ్రామానికి వెళ్తున్నారని కొందరు మాకు చెప్పారు. మేము తిరిగి వెళ్ళిపోవాలని చాలా బాధపడ్డాము. కాని మాకోసమే అన్నట్టుగా స్వామివారు ఎక్కడికి వెళ్ళడం లేదని తెలుసుకొని చాలా సంతోషించాము. ఆరోజు రాత్రి అందరమూ ఆకాశం క్రింద పచ్చని తోటలో కూర్చున్నాము. నాకు తెలిసి ఆ రోజు పొర్ణమి అనుకుంటా. ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు. మొత్తం నక్షత్రాలతో నిండి ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తోంది. నన్ను అడగకుండానే స్వామివారి శిష్యులు నేను పాడాలనుకుంటున్నానని స్వామివారితో చెప్పారు. సరే అన్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్ గారి ‘సామ గాన వినోదిని’ పాడటం మొదలుపెట్టాను.
‘సామ గాన’ అని మొదలుపెట్టగానే మహాస్వామివారు వెంటనే నా వైపు తిరిగి వారి దివ్య కరుణా కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపజేశారు. అలా పాడుతూనే కళ్ళ నీరు పెట్టడం మొదలుపెట్టాను. నన్ను నేను నియంత్రించుకోలేక పాట పూర్తి చెయ్యడానికి చాలా కష్టపడ్డాను. తరువాత స్వామివారు మౌనవ్రతం వీడి నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. కేవలం నన్ను కరుణించడానికే స్వామివారు నాతో మాట్లాడుతున్నారు. తరువాత స్వామివారు ఆకాశంలో 27 నక్షత్రాలను చూపించి, వాటి గురించిన విశేషాలను, స్థానాలను విపులంగా వివరించారు. అలాగే 12 రాశులను కూడా చూపించారు. “సర్వేశ్వరా! ఎంతటి అనుగ్రహం”.
దాంతో మహాగావ్ లో మా దర్శనం పూర్తయ్యింది. వారిని తరచుగా దర్శించుకోవాలనే కోరిక చాలా బలపడింది. వారి భౌతిక దర్శనం ఒక ‘తత్వయోగి’ని చూసినట్టు. వారి స్వరూపం అవ్యాజ కరుణ, ప్రేమ, భక్తి స్వరూపం. వారి తీక్షణమైన వీక్షణాలను ఆ యోగిక శక్తిని నేను ఎన్నటికి మరచిపోలేను. అవి దక్కడం నా అదృష్టం. అది కేవలం వారి అనుగ్రహం.
--- ‘మ్యూసిక్ మాస్ట్రో’ ఇళయరాజా గారి ఇంటర్వ్యు నుండి

Monday 9 January 2017

లోకం - ధర్మం అంటే ఏమిటి?

‌              భారతీయ తత్వశాస్త్రం ౼ 24
                   (Indian Philosophy)
                       అవైదికదర్శనాలు

      (కొన్ని భౌతిక దర్శనాలు : బౌద్ధ దర్శనం.)
                      బుద్ధ చరిత్ర.
           ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
     

          లోకం - ధర్మం అంటే ఏమిటి?
    

బుద్దుడు ప్రధాన అనుచరుడు ఆనందుడు, భిక్షుల అభ్యర్థన మేరకు, లోకం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకున్నాడు.
    ఆనందుడు పై విషయాలపై ధర్మబోధ చేయాలని బుద్దుని కోరాడు. ఆనందుడు అడగడంలో ఏదో ఆంతర్యం ఉంటుందని బుద్దుడు వెంటనే అంగీకరించారు.
     *బుద్దుడు:-* ఆనందా! ఈ లోకం అనేక ధాతువుల కలయిక. అణువుల సమాహారం. అవి కలసి, రూపొంది, పరిమాణం చెంది, పరిమాణంలో మార్పులకు లోనై నశిస్తుంటాయి.
     అన్ని ధర్మాలు, ఇంద్రియాలు, అభిరుచులు, అనుభూతులు, చేతనలు -- అలా పరిమాణం చెందుతూ నశిస్తుంటాయి. ఏవి శాశ్వతంగా ఉండవు. ప్రతి క్షణం పరిణామం చెందవలసిందే. సూక్ష్మంగా చెప్పాలంటే మార్పు చెందుతూ నశించేది 'లోకం' అనుకోవాలి.
     *ఆనంద్:-* మీరు అనేక సందర్భాలలో చెబుతుంటారు. అన్ని ధర్మాలు శూన్యాలే నని. శూన్యం అంటే ఏమిటి గురుదేవా!
     *బుద్దుడు:-* శూన్యం అనడంలో నా అభిప్రాయం వేటికి మనుగడ లేదని. శాశ్వతంగా నిలబడవని.
     *ఆనందుడు:-* అంటే అన్ని ధర్మాలు శూన్యాలేనా?
     *బుద్దుడు:-* నీవు 'శూన్యం' పైన భావన చేయ్యి. ధ్యానంలో 'శూన్యం' బరువు తెలుస్తుంది. 'శూన్యత' విలువ తెలుస్తుంది. జనన మరణాలను దాటిపోవడానికి శూన్యధ్యానం మించిన సాధనం లేదు.
     *ఆనంద్:-* గురుదేవా! ఇప్పుడు ఈ మందిరం ధ్యానులతో నిండి ఉంది. దీనిని పూర్ణం అనవచ్చు కదా!
     *బుద్దుడు:-* నిండి ఉండడం పూర్ణత్వం అయితే శూన్యంతో నిండి ఉండడం కూడా పూర్ణత్వమే.
     వీళ్ళంతా ధ్యానంలో మైమరిచి పోయినారనుకుందాం. వారికి ప్రపంచ ధ్యాసలేదు. కను వారికి తాము శూన్యమే, ఈ మందిరం శూన్యమే, ప్రపంచం శూన్యమే.
     అన్ని ధర్మాలు నశించేవి అనడంలో అన్ని మార్పులు చెందేవి అని అర్థం. చివరికి ఏవి మిగలవు. శూన్యం అంటే ఆత్మ సైతం మిగలని స్థితి. అది శూన్యం అంటే.
     *ఆనంద్:-* కొందరు వైదికవాదులు, అన్యమతస్థులు బుద్దునిది శూన్యవాదం అని ప్రచారం చేస్తున్నాం. జీవనవాదానికి భిన్నమైనది శూన్యవాదం. అస్తిత్వానికి భిన్నమైనది నాస్తికవాదం. కాదంటరా! ధర్మాలు శూన్యం అంటే అందరికీ కోపం వస్తుంది కదా!
     *బుద్దుడు:-* ఈ విషయంలో పండితులే కాదు యావత్ ప్రపంచం నన్ను అపార్థం చేసుకుంటుంది.
     అన్నీ శూన్యం అని నేనెప్పుడూ చెప్పలేదు. జీవితాన్ని త్రోసి రాజనలేదు. అస్తిత్వాన్ని ఆమోదించేవారు నాస్తికత్వాన్ని ఆమోదిస్తారు. పూర్ణత్వాన్ని ఆమోదించే వారే శూన్యాన్ని ఆమోదిస్తారు.
      అస్తిత్వం ఎన్నటికీ శూన్యం కాదు. కాని చివరికి మిగిలేది శూన్యం. అంటే శూన్యతా భావన. ఒక విధంగా చూస్తే అన్నింటి స్వభావంలో శూన్యం ఉన్నట్లు. మరొక విధంగా విశ్లేషిస్తే అన్ని భ్రమలనిపిస్తాయి. భ్రమవాదం లోనికి వెళితే గాని సత్యం గోచరించదు.
      *భిక్షు కాత్యాయన:-* ఏది సవ్యమైన దృష్టి? ఏది అపసవ్య దృష్టి?
    *బుద్దుడు:-* అపసవ్య దృష్టి అంటే ఆస్తిక, నాస్తిక భావనలు ఏర్పరుచుకోవడం. సవ్యదృష్టి అంటే ఆ రెండింటికీ విలువ ఇవ్వక పోవడం. ఆస్తిక, నాస్తిక భావనలకు దృష్టి దోషం ఉంది. వాస్తవం ఎప్పుడూ సిద్ధాంత, రాద్దాంతాలకు అతీతం. సత్యాన్ని గ్రహించిన వారిని జ్ఞానులు, ప్రాజ్ఞులంటారు.
     *ఆనంద్:-* అంటే అర్థం కాలేదు.
     *బుద్దుడు:-* ఉదాహరనకు ఈ ధర్మమందిరం ముందర ఉన్న బోధివృక్షాన్ని తీసుకో అది ఎప్పుడు పుట్టింది?
     *ఆనంద్:-* నాలుగు సంవత్సారాలై ఉంటుంది.
     *బుద్దుడు:-* నాలుగు సంవత్సరాల క్రిందట అక్కడ బోధి వృక్షం ఉన్నట్లా? లేనట్టా?
     *ఆనంద్:-* లేనట్లే.
     *బుద్దుడు:-* అంటే శూన్యం నుండి బోధి వృక్షం ఉద్భవించిందా? కాదు గదా. అలాగే ఏ ధర్మం అయినా శూన్యం నుండే ఉద్భవిస్తుంది. బీజం ఎక్కడో ఉంటుంది. విత్తనం లేకుండా మొక్క మొలకెత్తదు. మహావృక్షంగా పెరగదు. అది పరిణామం. చెట్టు విత్తనానికి పొడిగింపు. వేళ్ళు నేలలో పాతుకునే వరకు. కొమ్మలు, రెమ్మలు పైకి విస్తరించే వరకు అది బీజంలో ఉన్నట్లే. కాదంటే చెట్టు రూపంలో ఉండదు.
     వేళ్లు నేలలో పాతుకున్నాక విత్తనం చనిపోతుందా? లేదు. విత్తనం లేకుండా పోయింది. విత్తనం రూపం మారింది. పరిణామంలో స్థితి మారింది. ఒక స్థితిలో నుండి మరో స్థితిలోకి మారడం.
     అలాగే మరణంతో మనిషి మరణించడు. పరిణామం చెందుతాడు. మృత్యువు వలన నశించేది ఏది ఉండదు. ప్రాయికమైన ధాతువులు వేటికవి విడిపోతాయి. జీవం ముందుకు సాగుతుంది. అయితే జీవానికి జననం లేదు, మరణం లేదు. ఉన్నది ఒకటే పరిణామం.
                           ---- మీ సత్యాన్వేషి

Sunday 8 January 2017

భారతీయ గోవును ఎందుకు కాపాడాలి?

                         

న్యూజిలాండ్‌ దేశ ప్రముఖ ఆహార శాస్త్రవేత్త డా|| కీల్‌ఉడ్‌ఫోర్డ్‌ తమ జాతుల ఆవుపాలు విషపూరితాలని పేర్కొన్నారు. వీటిలో ”బీటి కాసోమార్ఫిన్‌-7 (బిసిఎమ్‌-7)” అనే విషపదార్థాలవల్ల జెర్సీ లాంటి జాతుల ఆవుపాలు మిక్కిలి అనారోగ్యకరమనీ, కాన్సర్‌ వంటి భయంకర రోగాలు కలుగుతాయనీ తెలిపారు. వీటికి ఏ-1 రకం పాలని పేరు పెట్టారు.
మరి ఏ-2 రకం పాలు భారతీయ గో జాతుల పాలు (మూపురం- సూర్యకేతు నాడి ఉన్న గో జాతులు) అనీ, ఇవి రోగాలను నాశనం చేసే శక్తి కలవనీ, విదేశీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ప్రస్తుతం మన భారతీయ గోజాతుల సంతతు లను (బ్రీడ్‌లు) వారి దేశాలకు తీసుకు పోతున్నారు. అంతేకాకుండా డా||ఎన్‌.గంగాసత్యం రచించిన ”అర్క్‌ తీసుకొండి- ఆరోగ్యంగా ఉండండి” అనే చిన్న పుస్తకం ప్రకారం (19వ పేజీలో) జెర్సీపాలు త్రాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి కేన్సర్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. అతి చిన్నదైన తైవాన్‌ దేశంలో, పాలలో ఉండే ఒక ప్రోటీన్‌ కేన్సర్‌ పెరుగుదలను నిరోధించగలదని వారి ప్రయోగాల గురించి ఒక వార్తా పత్రికలో వచ్చింది. ఒక దేశవాళీ జాతి గోమూత్రంలో బంగారం ఉన్నదనీ, దానికై ప్రయోగాలు అధికం చేస్తున్నట్లు ఈ మధ్యనే దిన పత్రికలలో ప్రచురించబడింది. ప్రపంచం అంతా మన గోజాతుల పాల గురించి కోడై కూస్తుంటే, మనం మాత్రం శుప్తావస్థలో జోగుతూ ఉన్నామంటే – ఎవరైనా నవ్వుతారు.
బ్రెజిల్‌ వంటి దేశాలవారు 16 కోట్ల మన ఒంగోలు జాతి సంతతిని అభివృద్ధి చేసుకొని, తమ దేశ ప్రధాన ఆర్థిక వనరు గోవులే అని ప్రకటించు కొన్నారు. మరి మన దేశంలో, రాష్ట్రాలలో ప్రధాన ఆర్థిక వనరులు ఏవో మనకు తెలుసు. ప్రముఖ న్యాయస్థానాలు కూడా ”మద్యం ప్రవాహం లేకుండా ప్రభుత్వాలు పరిపాలన చేయలేవా?” అని ప్రశ్నించిన ఉదాహరణలున్నాయి. ”అమూల్‌ బ్రాండ్‌”తో ప్రపంచ దేశాలకే పాఠం చెప్తూ-భారతీయ శక్తిని, హరిత విప్లవం, శ్వేత విప్లవం (గ్రీన్‌ వైట్‌ రివల్యూషన్స్‌) ద్వారా చాటి చెప్పిన మేటి వ్యక్తి డా||వర్గీస్‌ కురియన్‌ను మరల గుర్తు చేసుకోవలసిందే.
ప్రపంచంలోనే అతిపెద్ద గోశాల సౌదీలో వుందిట. అనేక ముస్లిం దేశాలలోను, బ్రెజిల్‌ వంటి దేశాలలోను గో సంరక్షణ, గో జాతుల ఉత్పత్తి చేస్తూ ప్రపంచ రికార్డులను ప్రదర్శిస్తున్నారు. ఏ మత గ్రంథాలలోను గోవులను వధించమని, భక్షించమని లేదనీ ప్రపంచ ప్రసిద్ధ విద్వాంసులందరు తెలియ జేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎమ్‌.ఎల్‌.ఏ. జమీరుల్లా ఖాన్‌ గోమాత రక్షణకు నడుంకట్టినట్లు పత్రికలలో చదివాము. కొన్ని ముస్లిం మతసంస్థలు కూడా గోవధ చేయరాదనీ, దానికి తాము కూడా వ్యతిరేకమే అనీ ముందుకు వస్తున్నాయి. ఒక ప్రముఖ వార్తా పత్రిక తమ విశేష సంచికలో ఒక ఆవు 10 ఎకరాల బీడు భూమిని సస్యశ్యామలం చేయగలదనీ, 300 రకాల రోగాలను నయం చేయగలదనీ, 3,00,000 రూపాయల జాతీయాదాయాన్ని పెంచుతుందనీ తెలిపారు.
జంతు జాతులన్నింటిలో గోవు విశిష్టతను గూర్చి శాస్త్రకారులు ఎప్పటి నుండో తెలియజేస్తున్నారు. తిలక్‌,గాంధీ, మదన్‌మోహన్‌ మాలవీయ, అంబేడ్కర్‌ వంటి ఎందరో జాతీయ నాయకులు మన దేశ మూలాలు, గోవులో ఉండే పవిత్ర, ధార్మిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ సంబంధాన్నీ, శక్తినీ తెలియజేస్తూ – స్వతంత్ర భారతములో సంపూర్ణ గోవధ నిషేధాన్ని ఆశించి, రాజ్యాంగంలో పొందుపరిచారు.
నిత్య జీవితంలోనూ పతంజలి – రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌, గో బ్రాండ్‌ ఔషధాలు వాడటం ద్వారా అన్ని మతాల, కులాల, వర్గాలవారు వారి ఆరోగ్య విషయాలలో ప్రయోజనాలు పొందుతున్న ఉదాహరణలు కోకొల్లలుగా వున్నాయి. హైద్రాబాద్‌ నేటి మేయర్‌ – బొంతు రామ్మోహన్‌ మాతృమూర్తి గో మూత్రం వాడటం ద్వారా కేన్సర్‌ జబ్బు నుండి విముక్తమై ఆరోగ్యంగా ఉన్నట్లు తెలియజేసారు. ”అమృతవర్షిణి కథావీధి” అను చిరుపుస్తకంలో ప్రముఖ విద్యావేత్త చిట్టా దామోదర శాస్త్రి ఈ మధ్యకాలంలో జరిగిన నిజ జీవితపు ఉదాహరణలు, గోమాత శక్తినీ, వైద్యపరంగా దాని విశేషతలను తెలియజేసారు. కిడ్నీల మార్పు అవసరంలేకనే రోగి ఆరోగ్యం గో మూత్రము, పంచగవ్య చికిత్సలద్వారా బాగుపడిన ఉదాహరణలు డాక్టర్లకే ఆశ్చర్యమును కలిగించేవిగా ఉన్నాయి.
భైంసా మండలం ‘ఖోని’ గ్రామ నివాసియైన గంగాధర్‌ అనే ఉపాధ్యాయుడు 28 ఎకరాల మొత్తం పొలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. గతంలో లక్షాముప్ఫై వేల రూపాయల ఎరువు మందులు, పురుగుమందులు వాడేవాడిననీ, కానీ ఈ రోజు ఒకపైసా కూడా ఖర్చు చేయట్లేదనీ తెలిపారు. అంతేకాకుండా అందరికంటే ఎక్కువ పంటదిగుబడి సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ, ఆ లక్షా ముప్ఫైవేల రూపాయలు ప్రారంభంలోనే మిగిలాయి అని సంతోషంగా తెలిపారు. ఇలాంటి రైతులు అనేక మంది గో ఆధారిత వ్యవసాయం చేస్తూ, ఆదర్శ రైతులుగా రసాయనిక విషాహారం కాని అమృతాహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
”సోషల్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ స్పిరిట్యుయాలిటీ” అంటే సమాజానికి ఆధ్యాత్మికతను అనువర్తించడం. ఆధ్యాత్మికత సామాజిక అనువర్తి భారతీయ సంస్కృతిలో అడుగ డుగునా కనిపిస్తుంది. అలాంటి జాతీయ మూల తత్వాన్ని స్వాతంత్య్రం వచ్చాక దెబ్బకొట్టే ప్రయత్నం జరిగింది. బూజు పదార్థం కూడా అనుభవజ్ఞుల చేతిలో పడితే ప్రజోపయోగ కరమైన ”పెన్సిలిన్‌” తయారైంది. భారతీయ దార్శనికులు, ఋషులు చెప్పిన ఆ మూలాలే మన సంస్కృతినీ, జాతినీ పరిరక్షించాయి. గోరక్షణ- దేశ రక్షణ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మహాత్మా గాంధీ తెలిపారు. ఇంతటి మ¬న్నత లక్షణా లున్న మన గోమాతను కాపాడుకోవటం మనందరి బాధ్యత.
ఇప్పటికే దేశంలో నగరాలు, పట్టణాలలోనూ దేశీ గోవుల స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి, వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా శ్రద్ధ చూపిస్తే మంచి దేశీ గో- సంతతులను అభివృద్ధి చేయుటం వేగవంతమవగలదు.
గో సంరక్షణ- గోవధ నిషేధానికి సంబంధించి ప్రభుత్వ- రాజ్యాంగ చట్టాల గురించి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ లేఖలు వ్రాసినట్లుగా 10.08.2016 నాటి దినపత్రికలలో చదివాము. 7వ షెడ్యూల్‌లోని 15వ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా గుర్తుచేస్తున్నట్లు చదివాము. దేశంలోనే అతిపెద్ద గోవధశాల తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న సంగతి మరవలేము. గతంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, సైబరాబాద్‌ పోలీస్‌కమీషనర్‌ వంటివారు ఈ విషయమై నిర్దిష్ట ఉత్తర్వులనూ క్రింది శాఖలవారికి ఇచ్చారు. కనుక మన ప్రభుత్వం జిల్లాల అధికారులతో గో సంరక్షణ, గోవధ నిషేధ చర్యలు ప్రారంభిస్తే, కొన్ని లక్షల గోవధలను ఆపిన పుణ్యం ప్రభుత్వానికి దక్కుతుంది. బంగారు తెలంగాణ కూడా గోవులతో సాకారమవు తుంది.

Tuesday 3 January 2017

జననీ జన్మ భూమిశ్య స్వర్గాదపీ గరీయసీ’ అన్నదెవరు.?



రఘుకుల తిలకుడు, మానవ అవతారమెత్తి, పరిపూర్ణమైన మానవునిగా జీవించి, ధర్మ, అర్ధ, కామ, మొక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీ రాముడు రావణ సంహారము తర్వాత – తల్లీ,జన్మించిన ప్రదేశము స్వర్గంకన్న పరమ ఉత్తమము అయినది అని చెప్పాడు. లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన అనంతరము లంకలోకి ఐశ్వర్యమూ, బంగారము, వజ్రాల భవంతులకుశ్రీ రామునికి చూపించి, ‘ఆహా అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమనది…ఇక్కడే ఉండిపోవచ్చు కదా. .’ అని శ్రీ రాముడితో అంటే, ఆ సమయాన శ్రీ రాముడు మృదుమధురంగా ‘జననీ, జన్మభూమిశ్య, స్వర్గాదపి గరీయసి’ అని పలికాడు.

Saturday 31 December 2016

క్యాలెండర్ కధ ???

New year ...?
ఇంగ్లీషు సంవత్సరాది జర్పుకునేవారికి అభినందనలు. నేను మాత్రం ఉగాదినే మన నూతన వత్సరంకు ఆదిగా భావిస్తాను- శివ మాదిరెడ్డి
=======
క్యాలెండర్ కధ

ఈనాటి క్యాలండర్ కి తోలిరుపాలు ఏవని చూస్తే ముఖ్యము గా రోమన్ , ఈజిప్టు , గ్రేగేరియక్న్ విధానాల గురించి చెప్పుకోవాలి .

రోం సామ్రాజ్యాన్ని పాలించే రోమన్ చక్రవర్తి కాలం లో ఏడాదికి 304 రోజులుగా నిర్ణయించారు . వీటిని పది నెలలు గా విభజించారు . అప్పట్లో మార్చి తో కొత్త ఏడాది ప్రనంభంయ్యేది . ఆ తర్వాత క్రీస్తుపుర్వము ఏడో శతాబ్దము దగ్గరికి వస్తే రోమ్ ని పాలించిన "సుమా పామ్పిలియాస్ " ఏడాదిని 12 నెలలు గా విభజించాడు . రోజుల సంఖ్య ఏడాదికి 354 రోజులు గా చెప్పాడు . అయితే సరిసంఖ్యలు శుభకరం కావనే నమ్మకం తో ఒక రోజును కలిపి ఏడాదికి 355 రోజులు గా నిర్ణయించారు .

క్రీస్తు పూర్వము 153 లో ఏడాది ప్రారంభాన్ని మార్చి నుంచి జనవరికి మార్చారు . కాని చంద్రుడి గమనము , సూర్యుడు గమనము ప్రకారము చుస్తే ఏడాదికి రోజుల లెక్కల్లో తేడాలు ఉండేవి . ఈ గందరగోలాన్ని సవరించడానికి రోమన్ చక్రవర్తి " జూలియస్ సీజర్ " ప్రయత్నించారు . క్రీస్తు పూర్వము 46 లో ఈజిప్టు వెళ్ళిన ఆయన అక్కడ ఏడాది విభజించిన విధానాన్ని తెలుసుకుని రోమ్ లో అమలు చేశాడు . దాని ప్రకారము ఏడాదికి 365.25 రోజులు గా లెక్కగట్టారు . జనవరి , మార్చి , మే , జూలై , ఆగష్టు , అక్టోబర్ , డిసెంబర్ , నెలలకు 31 రోజులుగా ... ఏప్రిల్ , జూన్ , సెప్టెంబర్ , నవంబర్ నెలలకు ౩౦ రోజులుగా ఫిబ్రవరి నెలకి28రోజులుగా నిర్ణయించారు . అయినా పావురోజు మిగిలిపోయింది . . దాన్ని నాలుగేళ్ల కొకసారి ఫిబ్రవరి కి కలపాలనుకున్నారు . (లీపు సంవత్సరమన్నమాట) . ఇదే జూలియస్ క్యాలెండర్ .

అయితే సీజర్ తర్వాత క్యాలన్డర్ల రూపకర్తలు తప్పుగా అర్ధం చేసుకుని ముడేల్లకోసారే ఫిబ్రవరికి ఒకోరుజును కలిపేయడం మొదలెట్టారు . ఇది క్రీస్తుశకము 8 వరకు కొనసాగింది . దేన్నీ గమనించిన అగస్తస్ అనే చక్రవర్తి అంతవరకూ జరిగిన తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ళకు ఒకసారి ఒకరోను కలిపే పద్ధతిని ఆపించాడు . ఆ పై క్రీస్తుశకము 567 లో తిరిగి కొత్త సంవత్సరాన్ని మార్చి కి మార్చేశారు .

తర్వాత రోజుల్లో లెక్కలో కచ్చితత్వము పెరిగి ఏడాదికి " 365.242199 రోజులు గా గుర్తించారు . ఇందువల ఏడాదికి 11 నిముషాల 14 సెకనులు వంతున తేడా వస్తు క్రీస్తుశకం 1572 మచ్చేసరికి ఏకంగా 10 రోజుల పాటు క్యాలెండర్ లెక్క తప్పింది . దీన్ని " 13 వ పోప్ గ్రెగొరీ " సరిదిద్దించారు . అయిన ఏటా ౦.0078 రోజుల తేడా తప్పలేదు . అందువల్ల ప్రతి 400 ఏళ్ళకి లీపుసంవత్సరాని వదలివేయాలని నిర్ణయించారు . అందువల్లే 400 తో భాగించబడే శతాబ్ది సంవత్సరాలకే తీపు నిబంధన ఉండాలనే సవరింపు వచ్చింది . కాబట్టే 1700 , 1800 , 1900 , మామూలు సంవత్సరాలే .. 2000 మాత్రము లీపుసంవత్సరము .. అలాగే కొత్త సంవత్సరము జనవరి తో ప్రారంభ మవ్వాలని నిర్ణయించారు .

క్రీస్తుశకము 1582 లో అమలులోకి వచ్చిన ఈ గ్రెగోరియన్ క్యాలందరే ఇప్పటి మన క్యాలెండర్ కి నాంది .

హిందూ ధర్మాన్ని గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే ఇట్లా చెప్పవచ్చు!


* ఓం మాతృదేవో భవః

* ఓం పితృదేవో భవః

* ఓం ఆచార్యదేవో భవః

* ఓం అతిధిదేవో భవః

పై నాలుగు ధర్మాలు హిందూ ధర్మానికి మూల స్థంభాలు. ఈ నాలుగు ధర్మాలపైనే హిందూ జాతియొక్క నిర్మాణం జరిగిందని చెప్పటంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అమ్మా,నాన్నలను; గురువులను, అతిథిలను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో మన హిందూ శాస్త్రాలెన్నో కథల రూపంలో సవివరంగా చెప్పాయి.

శంఖంలో పోస్తేకానీ తీర్ధం కాదని నానుడి. అలాగే మొక్కై వంగనది మ్రానైవంగునా అనేదికూడా మరొక నానుడి. ఊహ తెలుస్తున్న వయసులో పిల్లల్లో శబ్దగ్రహణ శక్తి; విషయ గ్రహణ శక్తి; జ్ఞాపకశక్తి ఎక్కువగా వుంటుందని నాటి, నేటి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇదే విషయం ఆధారంగా, మంచి విషయాలను పిల్లలకు ఊహ తెలుస్తున్న వయస్సుల్లోనే ఉగ్గుపాలు పోసినట్ట్లుగా తెలియచేయాలని మన పూర్వీకులు నిర్ణయించారు.

మరి మన పూర్వీకులు పై విషయంలో ఏం చేసారు? సాధారణంగా మన ప్రపంచం పురుషాధిక్యత ప్రపంచం. స్త్రీకి రెండవ స్థానం ఇవ్వబడింది. ఇది సమసమాజానికి చేటు చేస్తుందని తెలిసే, మన పూర్వీకులు ప్రతి చోటా స్త్రీని మెదట స్థానంలో వుంచటానికి ప్రయత్నించారు. అందుకు మొదట ఉదాహరణే ‘ మాతృదేవో భవః ’ అని చెప్పటం. సీతారాములు; లక్ష్మీనారాయణులు; ప్రకృతి,పురుషుడు మరికొన్ని ఉదాహరణలు.

భూమి తనయొక్క ఆకర్షణచే ప్రతి జీవరాశిని తన అధీనంలో ఉంచుకుంటుంది (దీనివల్ల ఎన్నో సృష్టి లాభాలున్నాయి). భూమ్యాకర్షణలాగే, భౌతికమైన ఈ జగత్తులో, పుట్టుకతోనే ప్రతి జీవి, ముఖ్యంగా “ మనిషి ” తన జీవన మనుగడకోసం భౌతిక విషయాలపట్ల ఎక్కువగా ఆకర్షింపబడివుంటాడు. వాటి ఆకర్షణ వలలో పడిపోయి, తనయొక్క మూలాల్ని మరిచిపోతుంటాడు. ఒకానొక దశలో కేవలం ఒక మర మనిషిగా; సుఖాలకోసమే బ్రతకాలి అన్న ఒక్క మిషలో పడిపోతాడు. అప్పుడు సమాజం మిధ్యాలోకంలోనే కొట్టుమిట్టులాడుతూ వుంటుంది.

ఉగ్గుపాలు పోసినట్లుగా, మంచి విషయాలను పిల్లలకు చిన్నప్పుడే బోధించాలి అని పైన చెప్పుకున్నాంగదా. అందులోని భాగంగా, పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒక ‘మంత్రాన్ని’ మన పూర్వీకులు ఉపదేశించారు. అదే, “ ఓం నమఃశివాయః సిద్ధం నమః ” (అక్షరాభ్యాసం -అనే శీర్షికతో నాచే వ్రాయబడిన వ్యాసాన్నికూడా చదవగలరు). ఇంతకీ ఈ మంత్రానికీ, స్త్రీకి, పురుషునితో సమాన హోదా ఇవ్వటానికీ; మన హిందూ ధర్మానికీ ఏమిటి సంబంధం? అని సందేహం ఎవరికైనా రావచ్చు. మరి, మరికొంత ముందుకు చదవండి:

ఓం నమః = ఓం అంటే ప్రణవ నాదం; ఈ చైతన్య జగత్తుకు మూల నాదం; అటువంటి ప్రణవ నాదానికి నా నమస్కారములు అని మొదటగా ఆ చిన్న విద్యార్ధి చిలుక పలుకులు పలుకుతూ, మంత్రాన్ని వల్లె వేయటం మొదలుపెడతాడు.

శివాయః = ఈ పదం, ‘ శ్ + ఇ + వ్ + అ ’ అనే అక్షరాల కూర్పు. ‘ఇ’ = ఈ అక్షరం అమ్మ లేదా అమ్మవారిని సూచిస్తుంది; ‘అ’ = ఈ అక్షరం అయ్య లేదా అయ్యవారిని సూచిస్తుంది; భౌతికమైన ఈ జగత్తు నిర్మాణానికి ‘తల్లి, తండ్రు’లు మూలాలు. ఈ ఇద్దరి కలయికవలనే జగత్తు నిర్మాణం సాకారమవుతుంది. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా జగత్తు నిర్మాణం జరగదు. ‘శివ’ అనే పదం ‘శక్తి’ని సూచిస్తుంది. ఈ శక్తి అమ్మ, అయ్యవార్ల కలయిక వలననే జరుగుతుంది; ‘శ్+ఇ+వ్+అ’ ల అక్షరమాలలో ‘ఇ’ అక్షరం వున్నప్పుడే, ఆ పదం ‘శివ’ గా వుంటుంది; అందులోని ‘ఇ’ ని తీసివేస్తే, అది ‘శ్+వ్+అ’ = శవ అనే పదంగా మారుతుంది. అంటే, శివం, శవంగా మారిపోతుంది. శివం శక్తిమయం; శవం శక్తి హీనం. – కాబట్టి, అట్టి శక్తిమయమైన జగత్తుకు కారణభూతులైన అమ్మ, అయ్యవార్లకు, ఓం నమః = నమస్కరిస్తూ …

సిద్ధం నమః = అటువంటి జగత్ సృష్టికి మాతాపితలైన (లేదా నా పుట్టుకకు మూలకారణమైన నా తల్లి,తండ్రులకు ) వారియొక్క ఆశీస్సులు సదా నాకు ‘సిద్ధించాలి కోరుకుంటూ, నమస్కరిస్తున్నాను’….

అనే అర్ధంతో ఆ మంత్రాన్ని మన పెద్దలు మనకు ఊహ తెలియటం మొదలవుతుండగానే మననం చేయించారు. మొక్కగా వున్నప్పుడే మనసులో పడిన ఆ భావంయొక్క అర్ధం పెద్దయిన తరువాత మానుగా మనస్సులో నిలబడిపోయి, మన తల్లి,తండ్రులను గౌరవించటం, ప్రేమించటం, అలవాటు అవుతుందని చెప్పటంలో ఎటువంటి అనుమానం వుండనక్కరలేదు.

పై విషయాల్ని, ఆదిశంకరులు తమ ‘సౌందర్యలహరి’ లో మొట్టమొదటి శ్లోకం, “శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః” లో మనందరికీ తెలియచేసారని పండితులు తమతమ భాష్యాలలో మనకు చెప్పటం జరిగింది. మరి మన కర్తవ్యం ఆ మంత్రాన్ని మనం చేసి, చేస్తూ, చేయిస్తూ వుండటమే!! స్వస్తి.

న్యూ ఇయర్

ఈ మెసేజ్ జనవరి ఒకటి కంతా తెలుగు వారికందరికీ అందిద్దాం.
అసలీ జనవరి 1 కథ ఏంటి? ఏప్రిల్ ఫూల్ ఎందుకొచ్చింది?
నాకు చాలా మంది మిత్రులు జనవరి ఒకటిన "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ " అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు. అది వారి ప్రేమకు తార్కాణం. కానీ నేనిప్పటిదాకా నాకు బుద్ధొచ్చాక నేనైనేను ఎవరికీ చెప్పలేదు. (నా పై అధికారులకు తప్ప).
ఇలా విషెస్ చెప్పే వారిది ఏ తప్పూ లేదు. ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి ప్రారంభం న్యూ ఇయర్ కాదని తెలియదు. ఇక ఎంజాయ్ ఎంజాయ్ అని త్రాగి తిరిగే వాళ్ల కథ నాకు తెలియదు. ఇక పై ప్రశ్నలకు సమాధానం చూద్దాం.
ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్‌ గ్రెగేరియన్ క్యాలెండర్. ఇదంతా తప్పులతడక, లోపాల పుడక.క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది.ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు. అదేంటంటే, క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం.
ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్కాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు లెండి. ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి. మంచిది...
ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది. బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది. ఫ్రాన్స్‌ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతూంది. అయితే, కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్‌ కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చి లో ఉంచాలా, ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు. ఆ సమయం లో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరి ని ఒకటవ నెలగా నూతన సంవత్సరం గా ప్రారంభించాడు.ఈ విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది. 
ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు. ముందుగా ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి. క్రీశ 1699 లో జర్మనీ, క్రీశ 1752లో ఇంగ్లండు, క్రీశ 1873 లో జపాన్‌, క్రీశ 1912 లో చైనా, క్రీశ 1916 లో బల్గేరియా, క్రీశ 1918 లో రష్యా లు ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి. 17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషు వాడు దీన్ని ప్రవేశపెట్టాడు.
కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది. ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాన్ శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో, వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది.
ప్రకృతి కి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది. (కొన్నిచోట్ల వసంత ఋతువు మేశరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.) 
ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని, వాడెవడో ఫ్రాన్స్‌ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరం ను ఫాలో అవడం కంటే, ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరం ను ఫాలో కావటం ఉత్తమము మరియు మన కర్తవ్యము. 
ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం. ఈ మెసేజ్ జనవరి 1 లోగా తెలుగు వారికంతా వెళ్లేలా చేస్తే, సగం పని జరిగినట్లే.

 భారత్ మాతా కీ జయ్.
పెద్దల ద్వారా విన్నదాన్ని మీకు విన్నవించాను.

శివరాత్రి మిత్రమ

శివరాత్రి మిత్రమ :-

సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర స్థ్సానాంతరాధిష్ఠితం,

సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్విసనా శోభితం

భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం

సేవే శ్రీ గిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్

Friday 30 December 2016

రమణ మహర్షి !



ఎవరి బోధా లేకుండా, తనంత తానే ఆత్మజ్ఞానిగా రూపొందినవారు రమణ మహర్షి. సుఖదుఃఖాలకు అతీతంగా జీవించి, ‘మహర్షి’ పేరును సార్థకం చేసుకున్నారు. ఆయనలో అప్రయత్నంగా కలిగిన ఆత్మవిచారం సహజ నిర్వికల్ప స్థితికి దారితీసింది. అరుణాచలం ఆయనకు ఆధ్యాత్మిక కేంద్రమైంది. అది ఈశ్వరుడి హృదయ స్థానం. ఆ జ్యోతిర్లింగ దివ్యకాంతులు రమణులపై ప్రసరించాయి.
అది 1879 డిసెంబరు 30. తమిళనాడులోని తిరుచుజి గ్రామవాసులైన అలగమ్మ, సుందరమయ్యర్‌ దంపతులకు వేంకటరామన్‌ జన్మించారు. అదే రమణమహర్షి అసలు పేరు. ఆ బాలుడు దిండిగల్‌ బడిలో సాధారణ విద్యార్థి. చదువు అంతగా పట్టుబడకున్నా, ఏకసంథాగ్రాహి కావడం వల్ల అన్నింటా నెగ్గుకొచ్చాడు. మధుర మీనాక్షిని దర్శించి, ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు.
చదువుపై అతడి అశ్రద్ధ చూసి అన్న మందలించాడు. ఈ లౌకిక విద్యలన్నీ వ్యర్థమని వేంకటరామన్‌కు స్ఫురించింది. ఇల్లు వదిలి తిరువణ్ణామలై వెళ్లారు. భూగర్భ మందిరంలో ధ్యాన నిమగ్నుడయ్యారు. ఆయనను దర్శించేవారి సంఖ్య పెరిగింది. ఒకరోజు కుమారుణ్ని వెతుక్కుంటూ తల్లి వెళ్లింది. ఆమెకు పెన్సిల్‌తో ఒక సందేశం రాసిచ్చారు... ‘ప్రతి ప్రాణికీ కర్మను అనుసరించి జీవితం ఉంటుంది. అతడు ఎంత ప్రయత్నించినా, జరిగేది జరగక మానదు’ అని!
ఆయనకు ఉపన్యాస ధోరణి లేదు. శిష్యుల సందేహాలకు సూటిగా సమాధానాలిచ్చేవారు. అనేక దేశాల నుంచి పలువురు తమ సందేహాలు తీర్చుకోవడానికి రమణ మహర్షిని ఆశ్రయించేవారు. ఆత్మజ్ఞానం కలిగినవాడే ‘గురువు’ అని ఆయన చెబుతుండేవారు.
‘శ్రీరమణ సద్గురు’ అని శిష్యులు ఆయనను పిలిచేవారు. జిజ్ఞాసువుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు ‘శ్రీరమణ గీత’గా ప్రసిద్ధి చెందాయి. హంఫ్రీస్‌ అనే పాశ్చాత్యుడు ఓ అంతర్జాతీయ మనోవిజ్ఞాన శాస్త్ర పత్రికలో రాసిన వ్యాసం వల్ల, ఆయన ప్రఖ్యాతి అంతటా వ్యాపించింది. సూరినాగమ్మ ‘రమణాశ్రమ లేఖలు’ తెలుగు ప్రజలకు ఆయనను మరింత చేరువ చేశాయి. ‘ఎ సెర్చ్‌ ఇన్‌ సీక్రెట్‌ ఇండియా’ గ్రంథకర్త పాల్‌ బ్రంటన్‌- రమణ మహర్షి వైభవాన్ని స్తుతించారు. మనశ్శాంతి కోసం వెళ్లిన కావ్యకంఠ గణపతి ముని ఆయనలోని మహాపురుషుణ్ని దర్శించారు.
శ్రీరమణుల భూతదయకు అంతు లేదు. పశుపక్ష్యాదులను ఆదరంగా చూసేవారు. కోతులు, ఉడతలు, పిచ్చుకల పట్ల దయాభావం చూపేవారు. జంతుభాష ఆయనకు అర్థమయ్యేది. ఒకరోజున ఓ ముసలి కోతి భుజాన కోతిపిల్ల ఉండటం చూశారు. ‘తాతా! ఎంత కష్టం వచ్చింది నీకు... ఈ వయసులో బిడ్డను పెంచాల్సి వచ్చిందే... జాగ్రత్తగా సాకు... ఇది నీకు పుణ్యమే’ అన్నారు గద్గద స్వరంతో. ఆ కోతిపిల్లకు తల్లి చనిపోయింది. తల్లిలేని పిల్లను పెంచాల్సిన బాధ్యత పెద్ద కోతిదే! ఈ విషయం మహర్షికి తెలుసు. అలాగే ఆయన ఒక గోవుకు లక్ష్మి అని పేరుపెట్టి పెంచారు.
కృష్ణుడు రేపల్లె విడిచి వెళ్లేటప్పుడు గోపికల శోకం, రామాయణ గాథలో ‘తారా విలాపం’ కథాభాగం వింటున్నప్పుడు- అనుభూతితో ఆయనకు కన్నీళ్లు ఆగేవి కావు. అదీ రమణ మహర్షి మనసు! అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాన్ని సైతం అతి సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు.
శ్రీరమణులు ‘ఆత్మవిచారం’, ‘నేనెవరు’ అనే గ్రంథాల్ని రచించారు. ‘భగవంతుడు శాశ్వతుడు. ఎక్కడికీ పోడు!’ అని బోధించారు. ‘నేను ఎప్పటికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను’ అని చెప్పేవారు. అరుణాచలంలోని రమణాశ్రమంలో ఆయన ఉన్నారనే దివ్యానుభూతి సందర్శకులకు ఇప్పటికీ కలుగుతుంటుంది. మహర్షి కరుణపూరిత నేత్రాలు వారిపై ప్రేమామృతాన్ని వర్షిస్తుంటాయి. అద్భుత సందేశాలు వారికి ఇంకా వినిపిస్తూనే ఉంటాయి!

డిసెంబర్ 30 "శ్రీ భగవాన్ రమణ మహర్షి" జయంతి

🌻🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి🌹🌻

🍀రమణ మహర్షి తత్వం : అద్వైత వేదాంతము

🍀ఉల్లేఖన : మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేను అనునది.

🍀శ్రీ రమణ మహర్షి (తమిళం : ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు.బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.

🍀రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.

🌷కుటుంబ నేపథ్యం🌷

🍀శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.

🌷బాల్యం🌷

🍀పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.

🌷బోధనలు🌷

🍀స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

🍀"The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
"In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."

🌷శ్రీ రమణ మహర్షి శిష్యులు🌷

🍀కావ్యకంఠ గణపతిముని

🍀యోగి రామయ్య

🌷భగవాన్ గురించి చలం🌷

🍀భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.

🍀చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, ఒక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! when you were in Thiruvannamalai go for a walk around the hill. The Arunachala hill will gives the power to all the hill itself called (Tejolingam). Shankara charya we sat in the hill and done the mediatation around the hill. if you can for a while into the hill you can catch the power.

Thursday 29 December 2016

శరీరంలోని షట్చక్రాలు….వాటి వివరాలు..



మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః

- వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.

7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం

1. మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.
2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.
3. మణిపూరక చక్రం : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.
4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.
5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.
6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.
7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

Sunday 18 December 2016

తిలకధారణ - తలరాత

తిలకధారణ - తలరాత

మన హిందుమతములో మాత్రమే బొట్టు పెట్టుకొనే ఆచారమున్నది. ప్రపంచములో ఏ ఇతర మతములలోనూ ఈ ఆచారములేదు.

''లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే''

''బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పింప ఎవరికి శక్యముగాదు,'' అని చెప్పుకొంటారు లోకములో, కష్టములు తప్పించుకోలేము అంటారు, కాని ఎవ్వరు ముఖమున బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను చెరిపి మంచి వ్రాత వ్రాసుకుంటున్నారన్నమాట, ఒక టేపురికార్డరు మీద ఏదైనా ఒక ఉపన్యాసము రికార్డు చేస్తే దానిని చెరిపి వేసి మరొకటి రికార్డు చేయటములా - అలాగే ఇది కూడా, బ్రహ్మదేవుడి వ్రాత ఎలా తప్పుతుంది అంటారేమో - పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు, పరమేశ్వరుని గుర్తుగా విభూతి, పార్వతీదేవిగుర్తుగా కుంకుమ మనము ధరిస్తాము. ముఖము చూడగానే విభూతి కుంకుమలు చూస్తే మనకు పార్వతీపరమేశ్వరులు జ్ఞాపకమువస్తారు, అట్లాగే ఇతర విధములైన బొట్లుకూడా భగవంతుని స్మరింపచేస్తాయి, భగవంతుడు జ్ఞాపక మున్నంతవరకూ మనకు మంచిబుద్ధి కలుగుతూనే వుంటుంది. మంచిబుద్ధి కలిగితే పాపములు చేయలేము. ఈ విధముగా పుణ్యకర్మలుచేసి బాగుపడుతాము. కాబట్టి హిందువులందరూ ముఖమున బొట్టు పెట్టుకొనడము తప్పక చేయాలి.

ఉదయమున లేచి బొట్టుపెట్టుకుని శుచిగా భగవంతుని ధ్యానము చేయాలి. తమకు ఇష్టము వచ్చిన స్తోత్రమునో, శ్లోకమునో, మంత్రమునో చదువుకొని భగవంతుని మానసికముగా ప్రార్థించాలి. కేవలము తమక్షేమము కొరకు మాత్రమే భగవంతుడిని ప్రార్థించకూడదు. ''అందరూ క్షేమముగా వుండాలి. వర్షాలు కురవాలి. అందరికీ కష్టములు తొలగిపోవాలి. అందరి మనస్సూ శాంతిగా ఉండాలి" అని ప్రార్థించాలి. అంటే "లోకాస్సమస్థా స్సుఖినోభవంతు" అనుకోవాలి. తమ క్షేమముకొరకు ప్రార్థించేవారికంటే, అందరిక్షేమము కొరకూ ప్రార్థించేవారు ఉత్కృష్టులు. మానసికంగా ప్రార్థన చేయటానికి డబ్బుఖర్చు లేదు కదా!

లోకాలు మూడువిధాలుగా ఉన్నాయి, సుఖలోకములు. దుఃఖలోకములు. మిశ్రమలోకములు. ఇంద్రాది దేవతలున్న స్వర్గాదులు పుణ్యలోకములు. నరకాదులు దుఃఖలోకములు, స్వర్గములో దుఃఖముండదు. నరకములో సుఖముండదు. మానవలోకము మిశ్రమలోకము, ఇక్కడ సుఖము, దుఃఖము రెండూ ఉంటవి. సుఖదుఃఖములు రెండూ తెలుసు కాబట్టే దుఃఖము తొలగేందుకు సుఖము కలిగేందుకు పుణ్యకర్మ చేయాలి. స్వర్గనరకాదులలో దేనిని పొందడానికైనా మార్గము మానవలోకములోనే వున్నది.''జంతూనాం నరజన్మ దుర్లభం'' అన్నారు శంకరులు, అట్టి మానవ జన్మ పొందిన తరువాత దానిని వ్యర్థము చేయకూడదు.

లోకములో కొందరు హృదయంలో కేవలం ధ్యానం చేస్తే చాలదా, కర్మానుష్ఠానము ఎందుకు అంటారు. కాని అది సరికాదు, మానవుడు తరించటానికి ఈశ్వరభక్తి, కర్మానుష్ఠానము రెండూ ఉండాలి. అంతశ్శౌచము, బాహ్యశౌచము రెండూ కావాలి. ముందు బాహ్యశౌచము పాటిస్తే హృదయ శుద్ధి ఏర్పడుతుంది. దేవపూజ చేసేముందు, ఇక్కడికి వచ్చే ముందు స్నానముచేసి రావాలి. భగవన్నామము స్మరిస్తూ స్నానమాచచించాలి. జీవితమంతా వ్యర్థ సంభాషణలతో, కేవలము ఉదరపోషణ ప్రయత్నములో గడుపుతే మనకూ, జంతువులకూ భేదమేమి? ఒక యంత్రములా తిని, నిద్రపోయి చనిపోతే జీవితము వ్యర్థమవుతుంది. కొందరు, అన్నీ భగవంతుడే చేస్తాడని, మనము ఏమీ చేయనక్కరలేదని చెప్పుతుంటారు. జంతువులకు కావలసినవన్నీ భగవంతుడు చూస్తాడు కానీ, మానవులకు భగవంతుడు స్వతంత్రంగా ఆలోచించే బుద్ధియిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి యుక్తాయుక్త విచక్షణతో కర్మను ఆచరించమని భగవంతుని అభిప్రాయము. ఆ బుద్ధిని సక్రమముగా వినియోగించు కొనక, కాలము వ్యర్థముచేస్తే పతితుడవుతాడు.

కావున హిందువులందరూ 1. తిలకధారణము, 2. సమిష్టి క్షేమము కొరకు మానసిక ప్రార్థన, 3. ఈశ్వరభక్తి, 4.కర్మానుష్ఠానమునందు శ్రద్ధ అలవరచుకొందురుగాక !

--- “జగద్గురుబోధలు”, jagadguru-vaibhavam.blogspot.in నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday 2 December 2016

నేటి యువత.....!

నేటి యువత.....!
youth

కాలంతో పోటీ పడే వేగంతో ఒకవైపు
కాలానికి విలువివ్వని సమరితనంతో మరోవైపు
అనుకున్నది సాధించే తెగువ ఒకవైపు
లక్ష్యం లేని జీవనం మరోవైపు
కుటుంబ భాద్యతలతో సంతోషం ఒకవైపు
ఒంటరితనపు వైరాగ్యం మరోవైపు
మదిలో ఆనందం ఒకవైపు
“మధిర”లోనే ఆనందం మరోవైపు
స్నేహానికి విలువతో ఒకవైపు
నమ్మక ద్రోహం నయవంచన మరోవైపు
సాగాల్సిన పయనం పక్కన పెట్టి
మధ్యం మత్తులో మాదకద్రవ్యాల చిత్తులో
మ్రగ్గిపోతున్న యువతా మేలుకో
||సోమ సుందర్ నిమ్మరాజు ||

విధి రాతని ఎవ్వరు తప్పించలేరు కదా అది జగం ఎరిగిన సత్యం? మరి అలాంటప్పుడు పూజలు ఎందుకు?

బ్రహ్మ రాసేటప్పుడే ఒక విషయం చెప్పాడు అదేమిటి అంటే బ్రహ్మ రాసిన బ్రహ్మ తప్పించలేదు కాని ఆ మనిషి తన పాప కర్మలవల్ల,దేవుడి జాపం వల్ల,అఖండమైన పుణ్యకార్యాల వల్ల తన రాతని మార్చుకునే శక్తీ బ్రహ్మ మనకు ఇస్తాడు
lord brahma

ఇదేలగా సాధ్యం

పూర్వం విదుముకుడు అనే రాజు ఉండేవాడు అతను చాల మంచి రాజు అయితే అయనకి 50 ఏళ్ళకి మృత్యు గండం ఉందని జ్యోతిష్కులు మహా పండితులు చెప్తారు,అయితే అయన గురువు ఉపదేశం వల్ల మృత్యుంజయ మంత్రం తెలుసుకుని జపించగా పైగా అతను ప్రజలకు చేసిన పుణ్యకార్యాల వల్ల అపమృత్యు దోషం పోయి ఆయుషు మంతుడు అవుతాడు.

ఎలాగా మనం బ్రహ్మ రాతని మనం మార్చగలం?

గుడిలో అర్చనలు,ప్రదక్షిణాలు,వ్రతాలూ నిత్యం ఇష్టదైవాన్ని జపించడం పురాణాలూ వినడం
బ్రహ్మ రాసిన రాత ఆపదలు తొలగించాలంటే లోకానికి శక్తిని ఇచ్చేది ఆదిపరాశక్తి జగన్మాతా అయితే ఆపదలు వస్తే ఆవిడా పాదాలను స్మరిస్తే ఆవిడా మన కష్టాలను తీర్చి  ఆపదలు దరికి రానీయకుండా చేస్తుంది

కార్యదీక్ష

🙏🏽🌹    *కార్యదీక్ష*   🌹🙏🏽
🍃🌺🌺🌺🙏🏽🌺🌺🌺🍃
కార్యసాధకుల విజయ రహస్యం- నిరంతర కృషి. మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని చూసి వారు వెనకడుగు వేయరు. వాటిని అధిగమించడానికి సమధిక ఉత్సాహంతో పనిచేస్తారు. వారు కర్మయోగులు.

జీవిని ఈశ్వరుడి వైపు నడిపించడమే యోగ లక్ష్యం. కర్మయోగులకు ముగ్గురు శత్రువులుంటారు. లోభ, మోహ, అహంకారాలే ఆ శత్రువులు. ఆ బారి నుంచి తప్పించుకుంటూ, సంయమనంతో ముందుకు సాగిన వారే లక్ష్యం చేరుకోగలరు. ఆంజనేయుడు మహా బలశాలి. సీతమ్మ జాడ తెలుసుకోవడం అనే మహత్కార్యంపై పయనమయ్యాడు. మార్గమధ్యంలో సురస అనే రాక్షసి అడ్డగించింది. అంతటి మహాబలుడూ తన శరీరాన్ని కుదింపజేసుకున్నాడు. సూక్ష్మరూపంలోకి మారడం ద్వారా, ఆ రక్కసి బారి నుంచి విముక్తుడయ్యాడు. తన లక్ష్యం సాధించడానికి ముందుకు సాగిపోయాడు.
మనిషి అనుకున్నది సాధించాలంటే, మొదట అహంకారాన్ని వీడాలి. కార్యసాధనలో పొరపాటు చేయడం ఎవరికైనా సహజం. అహంకారి తన తప్పును ఒక పట్టాన అంగీకరించడు. నిరహంకారి అవసరమైతే క్షమాపణ చెప్పడానికి వెనకాడడు. అందువల్ల అతడి గౌరవం ఇసుమంతైనా తరగదు. పైగా, అతడి నిజాయతీని అందరూ ప్రశంసిస్తారు.

కార్యసాధనకు పట్టుదల, ధైర్య స్థైర్యాలే కాదు- తగినన్ని ఉపాయాలూ అవసరమవుతాయి. అవి అపాయకరమైనవి, సమాజానికి కీడు చేసేవి కాకూడదు.

శ్రద్ధ, సద్భావనలు ఈశ్వర దర్శనానికి మార్గాలు. అందువల్ల భక్తుడు రామకృష్ణ పరమహంసలా నిత్యమూ అమ్మవారి సమక్షంలోనే ఉండగలడు. ఆ జగదంబను దర్శించగలడు. శిష్యుడు గురు కృప పొందడానికీ శ్రద్ధ అత్యవసరం. రామానంద స్వామిని గురువుగా ఎంచుకున్నాడు కబీరు. కానీ దీక్ష ఇవ్వడానికి, మంత్రోపదేశం చేయడానికి ఆయన అంగీకరించలేదు. అలా ఒక వ్యక్తికే దీక్ష ఇచ్చి శిష్యుడిగా స్వీకరిస్తే, మిగతా శిష్యులకు కోపం వస్తుందని ఆయన అభిప్రాయం. రామానందులు రోజూ గంగలో స్నానం ఆచరించేవారు. ఒకరోజు ఆయన అక్కడికి వెళ్లిన సమయంలోనే, కబీరు ఆ నది ఒడ్డున ఇసుకలో పడుకున్నాడు. గంగలో స్నానానికి దిగబోతూ పొరపాటున కబీరుపై పాదం మోపారు గురువు! వెంటనే పొరపాటు తెలుసుకున్నారు. ‘రామ రామ’ అంటూ పశ్చాత్తాపం వ్యక్తపరచారు. అనంతరం, స్నానం ఆచరించి తిరిగి వెళ్లిపోయారు.

గురువు పాద స్పర్శ పొందిన కబీరు, తనకు ఆయన దీక్ష ప్రసాదించారని పొంగిపోయాడు. పొరపాటున కాలు తగిలిందన్న పశ్చాత్తాప హృదయంతో రామానందులు పలికిన ‘రామ రామ’ అనే మాటల్ని గురువు చేసిన మంత్రోపదేశంగా భావించాడు. దాన్ని స్వీకరించి తన్మయత్వం చెందాడు భక్త కబీరు! రామానందుల శిష్యుల్లో అగ్రగణ్యుడయ్యాడు. సామాజిక అంతరాల్ని తన సంస్కార బలంతో సులభంగా అధిగమించగలిగాడు. భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడై ప్రసిద్ధి చెందాడు. ఆత్మ సంస్కారం కలిగినవారికి సామాజిక కట్టుబాట్లతో పని లేదు. వారి కార్యదీక్షకు ఏవీ ఆటంకాలు కావు, కాలేవు.

దేహ బలం, సౌందర్యం, ఆర్థిక పరిపుష్టి... ఇవన్నీ కార్యసాధనకు కొంతవరకు దోహదపడే అంశాలుగా గోచరిస్తాయి. బలహీన దేహం గలవారు, పేదరికంలో మగ్గినవారు, కురూపులు సైతం అద్భుత కార్యాలు సాధించిన ఉదంతాలు పురాణ గాథల్లో కనిపిస్తాయి. వారు అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఒక బాలుడికి చిన్నప్పుడే కాలు విరిగింది. అతడు దేనికీ పనికిరాడని కొందరు చిన్నచూపు చూశారు. మరికొందరు సానుభూతి కురిపించారు. ఆ చిన్నచూపును, సానుభూతిని తన మనసు నుంచి పక్కకు నెట్టాడా బాలుడు. తనకు తానే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. నిర్విరామ కృషి సాగించాడు. ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల రచయితగా వన్నెకెక్కాడు. ఆయనే హెచ్‌జీ వెల్స్‌!.
🌻       🌻

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles