Showing posts with label పద్యాలు. Show all posts
Showing posts with label పద్యాలు. Show all posts

Tuesday 17 January 2017

ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి టైం శ్వవచాహి విప్రాః!!

Keetah patangaah masakaascha vrikshaah
Jale stthale ye nivasanti jeevaah;
Drshtvaa pradeepam nacha janmabhaaginah
Bhavanti nityam svapachaahi vipraah.

వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు, భూమిమ ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక! అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక! అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు. ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం. దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి?

శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు

*కుదిరితే పరిగెత్తు*.. ,
*లేకపోతే నడువు*...
*అదీ చేతకాకపోతే*...
*పాకుతూ పో*.... ,
*అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు*...

*ఉద్యోగం రాలేదని*,
*వ్యాపారం దెబ్బతినిందని*,
*స్నేహితుడొకడు మోసం చేశాడని*,
*ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని*...
*అలాగే ఉండిపోతే ఎలా*?

*దేహానికి తప్ప*,
*దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే*...   
*తలుచుకుంటే*...
*నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా*...
*నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది*,
*అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా*?

*సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు*...,
*పారే నది*..,
*వీచే గాలి*...,
*ఊగే చెట్టు*...,
*ఉదయించే సూర్యుడు*....
*అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా*....,,
*ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు*..

*లే*...
*బయలుదేరు*...
*నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో*... ,
*పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు*...

*నువ్వు పడుకునే పరుపు*...
*నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్*... ,

*నీ అద్దం*....
*నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో*... ,

*నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్*..

*మళ్ళీ చెప్తున్నా*.....!
*కన్నీళ్ళు కారిస్తే కాదు*....
*చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో* ..!

*చదివితే ఇవి పదాలు మాత్రమే*,
*ఆచరిస్తే*...
*అస్త్రాలు*.

Friday 13 January 2017

పద్యం

ఐశ్వరస్య విభూషణం సుజనతా, శౌర్యస్య వాక్సంయమో,
ఙ్ఞాన స్యోపశమ, శ్రుతస్య వినయో,విత్తస్య పాత్రే వ్యయః,!
అక్రోధస్తపసః,క్షమా ప్రభవితుః, ధర్మస్యమిర్వ్యాజతా,
సర్వేషామపి సర్వకారణ మిదం శీలంపరం భూషణం!!

లోకంలో ఏ వ్యక్తి ఐనా సంపదలు కలిగి సుజనునిగా ఉండుట,శూరుడై మితభాషి అగుట,ఙ్ఞాని అయి ఇంద్రియ లోలత లేకుండుట,విద్యావంతుడై వినయము కల్గి ఉండుట,ధనము ఉండి సత్పాత్రతయందు వినియోగించుట,తపస్వి అయి కోపము లేకుండుట,సమర్ధుడై ఓర్పు గా ఉండుట,నెపము లేక ధర్మమును ఆచరించుట ఇవన్నీ వానికి అలంకారము తో సమానము...కనుక ఆ ఐశ్వర్యాదులు గల వారాకి ఈ గుణములే మేలైన భూషణము(శీలము) అని అర్ధము........

సర్వేజనాః సుఖినో భవన్తు...........

ఏకాక్షర (ఏకవ్యంజన) శ్లోకం



మామామ మా మమేమామా
మామూమామేమమేమమే |
మామామేమిమిమేమామ
మమోమామామమామమీ ||

పదవిభాగం -
మామ్, ఆమ, మా, మమ, ఇమాం, ఆమామూమ, అమేం, అమ, ఈం, అమే, అమామ్, అమః, మేమి (మా + ఏమి), మిమే, మామం (మా + అమం), అమః, మామామ (మా + అమామ), మామ్, అమీ.

అన్వయం -
మమ, మా, ఇమాం, మామ్, ఆమ, అమేం (అమా + ఈం), ఈం, అమ్, ఆమామూమ, అమే, మే, అమ, అమామ్, మేమి (మా + ఏమి), అమః, మామం (మా + అమం), మిమే, అమీ, మామ్, మామామ (మా + అమామ).

ప్రతిపదార్థాలు -
మమ = నా యొక్క
మా = బుద్ధి
ఇమాం మామ్ = ఈ లక్ష్మిని
ఆమ = పొందెను.
అమేం -
అమా = సహితురాలైన
ఈం = లక్ష్మి గల
అమ్ = నీ పాదాన్ని
ఆమామూము = ఆశ్రయించాము.
అమే = ఓ దుర్బుద్ధీ (జ్యేష్ఠాదేవీ)!
మే = నాకు
అమ = దూరంగా వెళ్ళు.
అమామ్ = లక్ష్మికంటె వేరైన దేవతను
మా + ఏమి = పొందను.
అమః = బంధరహితుడనై
మా = లక్ష్మి యొక్క
అమమ్ = ప్రాపును
మిమే = అపేక్షిస్తాను.
అమీ = ఈ మేము
మామ్ = ప్రమాణమైన శాస్త్రాన్ని
మా + అమామ = అతిక్రమింపము.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి)

శ్రీమద్భాగవతం పద్యాలు




క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరివర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధఘోర వాహినీ
హంతకు నింద్రనందననియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచిత భక్తజనానుగంతకున్.

భావము:
క్షమాగుణశీలికి; కాళియుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని నడిపినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.

శ్రీమద్భాగవతం పద్యాలు




న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.

భావము:
న్యాయాన్ని మెచ్చువాడికి, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గృహాలన్నిటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి.

Monday 9 January 2017

శ్రీమద్భాగవతం పద్యాలు 20


హారికి, నందగోకుల విహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్త దుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంప దపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్.

భావము:
మనకావ్యాలలో ఒక సంప్రదాయం ఉన్నది. కవి తనకావ్యాన్ని ఎవనికి అంకితం ఇస్తు న్నాడో అతని మహిమలను పేర్కొంటూ కొన్ని పద్యాలను పీఠికలో వ్రాస్తాడు. ఆవిశేషణాలన్నీ షష్ఠ్యంతాలతో శ్రీకృష్ణచంద్రుని స్తుతిస్తున్నాడు.
ఆ చిన్నారి కన్నయ్య అందరి హృదయాలను అలరింపజేసే అందగాడు. నందుని గోకులంలో విహారాలు చేసేవాడు. సుడిగాలిరూపంలో వచ్చిన రక్కసుని మక్కెలు విరుగదన్ని చంపింనవాడు. భక్తుల దుఃఖాన్ని తొలగించేదయామూర్తి. గోపకాంతల మనస్సులను దొంగిలించే మహనీయుడు. చెడుగుణాలనే సంపదలను నాశనంచేసే మహాత్ముడు. గొల్ల భామలకుటీరాలలో దాచుకున్న పాలూ, నెయ్యీ మొదలైన వానిని కొల్లగొట్టిన వెన్నదొంగ. బాలకగ్రహరూపంలో వచ్చిన పాడురక్కసి పూతన ప్రాణాలను చనుబాలతో పాటు పీల్చిచంపి వేసిన అద్భుత బాలకుడు. అటువంటి శ్రీకృష్ణచంద్రునకు నా కావ్యాన్ని అంకితం చేస్తున్నాను.
మనోహర హారాలు ధరించువాడికిం; సంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి.

శ్రీమద్భాగవతం పద్యాలు 21


లలితస్కంధము, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.

భావము:
భాగవతం ఒక కల్పవృక్షంలాగా కనపడుతున్నది పోతనమహాకవీంద్రునకు. కల్ప వృక్షం కోరినకోరికల నన్నింటినీ తీర్చి ఆనందాన్నందిస్తుంది. భాగవతం కూడా అటువంటిదే అని పోతన్నగారి సంభావన.

ఇదిగోనండీ భాగవతమనే కల్పవృక్షం. ఈ వృక్షం బోదె చాలా సుకుమారంగా ఉంటుంది. అలాగే భాగవతంలో స్కంధాలు లలితంగా ఉంటాయి. ఆ చెట్టుమూలం సార వంతమైన నల్లరేగడి మట్టితో ఉన్నట్లుగా భాగవతం నల్లనయ్యయే మూలంగా ఒప్పారు తున్నది. చిలుకలు కమ్మని నాదాలతో చెట్టును మనోహరం చేస్తాయి. ఈ భాగవతం శుకమహర్షి ఆలాపాలతో హృదయంగమంగా అలరారుతున్నది. చెట్టు నల్లుకొని పూలతీగలు దాని సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. భాగవతం మనోహరంగా ప్రకాశిస్తూఉంటుంది. కను విందుచేసే రంగురంగుల పూవులతో అందరినీ ఆకర్షిస్తుంది వృక్షం. ఈ భాహవతవృక్షం మంచిఅక్కరాలతో గొప్ప హృదయ సౌందర్యం కలవారికి చక్కగా తెలియవస్తుంది. అందమై నదీ కాంతులు విరజిమ్మూతూ ఉండేదే అయిన పాదు ఆ చెట్టును అలంకరిస్తున్నది. అందమై నవీ, వెలుగులుచిమ్ముతున్నవీ అయిన ఛందస్సునందలి వృత్తాలు ఈ భాగవతంలో ఉన్నాయి. అది గొప్ప ఫలాలను లోకానికి ఇస్తుంది. ఈ భాగవతం గొప్పదైన మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది. ఈ చెట్టు పాదు విశాలమై పుష్టినీ తుష్టినీ కలిగిస్తూ ఉంటుంది. భాగవతానికి వ్యాస భగవానుడే ఆలవాలం. ఆ చెట్టును మంచిపక్షులు ఆశ్రయించి బ్రదుకుతూ ఉంటాయి. ఈ భాగవతాన్ని సత్-ద్విజులు-అంటే ఉత్తమ సంస్కారం కలపండితులకు ఆశ్రయింప దగినదై విరాజిల్లు తున్నది.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles