Showing posts with label సంస్కృతి. Show all posts
Showing posts with label సంస్కృతి. Show all posts

Tuesday 17 January 2017

బొట్టు యొక్క విశిష్టత


మన సనాతన ధర్మంలో బొట్టుకు ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. స్త్రీ, పురుషులు ఇద్దరికీ కూడా బొట్టు అంతే అవసరం. వాడు ఎటువంటి మార్గంలో  పయనించేవాడైనా కొంత సనాతన ధర్మాన్ని నమ్ముతాడు అంటే బొట్టు పెట్టుకుని తీరాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించే వారు అందరూ కూడా బొట్టు పెట్టుకుని తీరాలి. అసలు బొట్టు రెండు కనుబొమల మధ్యలోనే పెట్టుకోవడానికి కారణం మన రెండు కనుబొమల మధ్య ఆజ్ఞ్యాచక్రం ఉంటుంది. ఆ ఆజ్ఞ్యాచక్రం మీద ఎదుటి వారి యొక్క దృష్టి పడకుండా బొట్టు పెట్టుకుంటాము. మనము తీసుకునే నిర్ణయాలన్నీకూడా ఆ ఆజ్ఞ్యాచక్రం మీదే ఆధారపడి ఉంటాయి. మనము ఏదైనా వస్తువు మర్చిపోతే భ్రుకుటి ముడి వేస్తాము. అలా భ్రుకుటి ముడి వేయడం వలన మనము మర్చిపోయిన విషయాన్ని జ్ఞ్యాపకం చేస్తుంది. కాబట్టి ఇది జ్ఞ్యాపకానికి కూడా అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టుకోవడం వలన పురుషుడు శౌచాన్ని పొంది ఉన్నాడు అని అర్ధం. ఒకవేళ అతను స్నానంతో వెంటనే విభూతి ధరించి నుదుట కుంకుమ ధరిస్తే అతడు ఆశీర్వదించడానికి అర్హుడు. ఒకవేళ అతను స్నానానంతరం వెంటనే కుంకుమ ధరించకుండా ఎవరినన్నా ఆశీర్వదించవలసివస్తే అతను మరల స్నానము చేసి వెంటనే కుంకుమ ధరిస్తే శౌచాన్ని పొంది ఆశీర్వదించే అర్హత వస్తుంది. అందుకనే పురుషులు స్నానం చేసిన వెంటనే విభూతి ధరించి నుదుట కుంకుమ ధరిస్తారు. మరి పురుషుడికే బొట్టు అంత పవిత్రమైతే స్త్రీకి పంచప్రాణాలు ఆ బొట్టులోనే ఉన్నాయి.

గర్వమే పతనానికి నాంది

ఎంతటి గొప్ప వారికైనా సరే వారు సురులు కావచ్చు అసురులు కావచ్చు. ఒక పర్యాయం గర్వం ఆవహించింది అంటే అది నెత్తిమీద నుంచి దిగేదాకా నెత్తిమీదే కళ్ళుంటాయి అంటే అతిశయోక్తి కాదు. సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ విషయం నుండి మినహాయింపు లేదు.
అనేక కల్పములయందు సృష్టి రచించి చతుర్ముఖునికి తాను ఒక్కడినే ఈ సృష్టి రచించుచున్నానని, తాను నిర్విరామంగా పనిచేయచున్నానని, తనకంటే ఎవరూ కూడా అధికులు లేరని, నిరంతర శ్రమజీవిన నే భావం పెరిగి పెరిగి వటవృక్షం అయింది. స్థితికారుడయిన విష్ణుమూర్తికి నాసాళమునకు అంటిన గర్వం దించేదాకా విశ్రాంతి యుండదు. ఒక వెయ్యి చతుర్వ్యుగాలు కాలం గడిస్తే బ్రహ్మకు పగలు మరొక వెయ్యి చతుర్వ్యుగాలు గడిస్తే రాత్రి. అటువంటిది బ్రహ్మకు తన జీవితకాలం పూర్తవాలి అంటే ఎన్నో వేల యుగాలు గడవాలి. అది బ్రహ్మ గర్వానికి కారణం. బ్రహ్మ యొక్క గర్వమును అణచదలచినటువంటి విష్ణుమూర్తి బ్రహ్మదేవుని తన వెంట తీసుకొని ఈ మాట ఆ మాట చెబుతూ వాహ్యాళికి బయలుదేరాడు. కొంతదూరం పోగానే బ్రహ్మదేవునికి తాను ఇప్పటివరకు చూడని ఒక ఋషిపుంగవుడు తారసపడినాడు. ఆ మహాశయుడిని తాను సృజియించినట్లు బ్రహ్మకు గుర్తులేదు. బ్రహ్మదేవుడు ఋషి వద్దకు వెళ్లి, అయ్యా! ఎంత ఆలోచించినను తమరు గుర్తుకు వచ్చుటలేదు అనగానే ఋషి పుంగవుడు విష్ణుమూర్తిని చూచి చివుక్కున లేచి నమస్కరించి బ్రహ్మతో ఇలా మాట్లాడాడు. అయ్యా నేను రోమశుడను. అందరూ రోమశ మహర్షి అంటారు. నాకు తపము ఆచరించుట మాత్రమే వచ్చు. బ్రహ్మకు నూరేళ్ళ ఆయుర్దాయం పూర్తయిన పిదప నా శరీరమునందలి ఒక రోమము దానంతట అదే ఊడిపడిపోతుంది. ఆ విధంగా నా శరీరంలోని రోమాలు అన్ని రాలిపోయిన పిదప మోక్షము ప్రసాదిస్తాను అని శ్రీమన్నారాయణుడుచెప్పాడు. నాకు అంతే తెలుసు అన్నాడు. బ్రహ్మ ప్రక్కనే వున్న శ్రీమన్నారాయణుడు అవునని చిరునవ్వుతో చూచాడు. రోమశ మహర్షి సమాధానమునకు బ్రహ్మ నివ్వెరబోయాడు.
తరువాత బ్రహ్మ విష్ణువులు మరికొంత దూరం పోగానే వంకరలు తిరిగిన శరీరంతో మరొక మహర్షి కనిపించెను. మహావిష్ణువు కనబడగానే ఆ మహర్షి లేచి నిలబడి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు ఆ యనతో అయ్యా, తమరు ఎవరని ప్రశ్నించాడు. అయ్యా నన్ను అష్టావక్రుడు అంటారు. నా శరీరమునందు అష్టవంకరలు ఉన్నవి. ఆ వంకరలు పోగానే మోక్షము ప్రసాదిస్తాను అని విష్ణుమూర్తి వరమిచ్చాడు. ఆ అష్టవంకరలు ఎలా బాగుపడతాయి అని బ్రహ్మ ప్రశ్నించగా అష్టావక్ర మహర్షి ఇలా బదులు చెప్పాడు. రోమశ మహాముని లాంటివారు ఒకరి తరువాత మరొకరుగా ఎనిమిది మంది ముక్తిపొందిన తరువాత నాలో ఉన్న ఒక వంకర మాయమవుతుంది. ఈ విధంగా నా అష్టవంకరలు తొలగగానే మోక్షం వస్తుందనిచెప్పాడని అన్నాడు.
అప్పటివరకు తనను మించినవారు లేరు అని భావిస్తూవున్న బ్రహ్మకు జ్ఞానోదయం అయింది. ఇప్పటివరకు చరాచర జగతిని సృష్టించేది నేనే అని గర్వపడుతూ ఉండేవాడు. విష్ణుమూర్తితో తండ్రీ నా కళ్లు తెరిపించినందుకు కృతజ్ఞుడను. నేను ఈ సృష్టికి సృష్టికర్త కావచ్చు కాని బ్రహ్మను సృష్టించినది మీరే అనే జ్ఞానం మరచినందుకు క్షమించండని అడిగాడు.
అపుడు విష్ణుమూర్తి ఇలా సెలవిచ్చాడు. నాయనా! రోమశ మహర్షి, అష్టావక్ర మహర్షివంటివారు ఎందరో ఉన్నారు. నిరంతర భగవన్నామ స్మరణ చేస్తూ హనుమంతుడు, మార్కండేయుడు చిరంజీవులుగానే ఉండిపోయినారు. మనం చేసే పని బాధ్యతాయుతంగా చేయాలి. నేను చేస్తున్నాను గదా అని గర్వపడరాదు. ఆ గర్వమే మన పతనాన్ని శాసిస్తుందని చెప్పాడు.

అణుకువ ఉన్నవారిలో భయం ఉండదు :


అణుకువ వలన మరో లాభం కూడా ఉంది. నిగర్వి ఎప్పుడూ కూడా నాకు ఫలానా వారి ద్వారా సరైన గౌరవము లభించలేదు అని అనడు. తను చెప్పిన వాటి వల్ల చెడు పరిణామాలు వస్తాయేమో అన్న భయం అతనికి ఉండదు. అహంకారికి తన మాటల ఫలితము ఎలా ఉంటుందో అని భయం ఉంటుంది. ఒక గర్వికి గౌరవము లభించదు, అతని మనసంతా భయాలతో నిండి ఉంటుంది. ఇంట్లోని వారితో సఖ్యత లేని కారణముగా ఇంటివారు ఎక్కడ విడిపోతారో అని ఇంటి భయం ఉంటుంది. గర్వము నుండి విముక్తి కావడానికి కావలసిన కృషిని తప్పక చెయ్యాలి. ఎందుకంటే గర్వము అనేది బాధాకర లోపము. ఈ భౌతిక ప్రపంచములో హోదా, ఉద్యోగమును చూసుకుని గర్వములోకి రావడము పొరపాటు. ఎందుకంటే గర్వము పతనానికి మూలము.

ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు

కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.
- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.

- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).

- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.

- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.

- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.

- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు.

- కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.

భోజన విధి


1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి.
2.తూర్పు, దక్షిణ,పడమర ముఖంగా కూర్చుని తినాలి.
3.మోదుగ,అరటి,పనస,మేడి ఆకులలో భోజనం ఉత్తమం
4.ఎడమవైపుగా కొస ఉండాలి.
5 . ఆకును నీటితో కడిగి మండలంపై ఉంచి వడ్డన చేయాలి.
6.ఎదురుకుండా కూరలు తరువాత మధ్యలో అన్నం,కుడివైపు పాయసం,పప్పు ఎడమవైపు పిండివంటలు చారు లేక పులుసు , చివర పెరుగు కలిపిన లవణం వడ్డన చేయాలి.
అన్ని వడ్డన అయ్యాక నెయ్యి వడ్డన చేయాలి.
7.ఆజ్య అభిఘారం లేకుండా అన్నము తినరాదు.
8.'త్రిసుపర్ణం' గాని 'అహంవైశ్వానరో భూత్వా '
మొదలగునవి పఠించవలయును.
9 చేతిలో నీరు గ్రహించి గాయత్రీ మంత్రముచే అన్నము పరిషేచన చేయవలెను.
10.తర్జనీ మధ్యమ అంగుష్ఠములచేత ఎదుటభాగం నుండి ఓం ప్రాణా...స్వాహా అని ఆహుతి గ్రహించవలేను
11.మధ్యమ,అనామిక,అంగుష్ఠములచేత దక్షిణభాగం నుండి ఓం అపానా...స్వాహా అని
12.కనిష్ఠ, అనామిక అంగుష్ఠములచేత
పడమర భాగం నుండి ఓంవ్యాన..స్వాహాఅని
13.కనిష్ఠికా తర్జనీ అంగుష్ఠములచేత ఉత్తరభాగం నుండి ఓం ఉదానా.. స్వాహా అని
15 అన్ని వేళ్ళు కలిపి మధ్యభాగం నుండి ఓం సమానా...స్వాహా అని ప్రాణాహుతులు దంతములకు తగలకుండా ఇవ్వవలయును.
16.ఉదయం రాత్రిపూట మాత్రమే భోజనము గృహస్తు చేయవలెను.
17 . మౌనంగా భోజనం చేయవలెను.
18.భోజనకాలమందు మంచినీరు కుడిభాగమందు ఉంచవలెను.
19.భోజనకాలమందు జలపాత్రను కుడిచేతి మణికట్టుపై ఉంచి ఎడమ చేతితో పట్టుకొని త్రాగవలయును.
20.భోజనం చేయుచూ పాదములు ముట్టుకొనరాదు.
21.చిరిగిన ఆకులో తినరాదు.
22.చెప్పులతోను?,మంచాలపైన, చండాలురు చూస్తూ ఉండగా భోజనం చేయరాదు.
23.భోజనం అయిన పిదప చేతిని కడుగుకొని
నీరు పుక్కిలించి పాదప్రక్షాళన చేయవలెను.
24.భోజనమునకు ముందు వెనుక ఆచమనం చేయవలయును.

Friday 13 January 2017

మంగళసూత్రం ఏ నక్షత్రం రోజున తీసుకుంటే మంచిది.?

పెద్దలు ముత్తైదువలను “దీర్ఘసుమంగళీ భవ” అని ఆశీర్వదిస్తుంటారు.

వివాహమైన మహిళలు సౌభాగ్యాలతో, సుమంగళీగా వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే ఈ ఆశీర్వచనంతో పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. ఓ మహిళకు నిండుతనాన్ని ఇచ్చేది మాంగళ్యం. అలాంటి మహిమాన్వితమైన మాంగళసూత్రాన్ని ఏ రోజు పడితే ఆ రోజు జ్యుయెల్లరీ షాపుల్లో కొనడం సరికాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వధువుకు స్వాతి నక్షత్రంతో కూడిన రోజున మంగళసూత్రం తీసుకుంటే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. మాంగళ్యాన్ని స్వాతి నక్షత్రంతో కూడిన రోజున చేయిస్తే లేదా కొనుగోలు చేస్తే ఆ వధువు సకల సంతోషాలతో, దీర్ఘసుమంగళిగా వర్ధిల్లుతుందని పురోహితులు చెబుతున్నారు. మాంగళ్యం మాత్రమే గాకుండా స్వాతి నక్షత్రంతో కూడిన శుభదినాన శంకుస్థాపన, గృహప్రవేశం వంటి శుభకార్యాలను చేయడం మంచిదే. స్వాతి నక్షత్రంతో కూడిన రోజున శుభకార్యాలను జరుపుకుంటే సుఖమయ జీవితం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

గుడికి ఎప్పుడు వెళ్ళాలీ

చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు దేవుని గుడికి వెళ్ళుతూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయిందా లేదా అని ఆలోచించే వారే ఎక్కువ మంది ఉంటారు. అయితే గుడికి వెళ్ళటానికి సమయం కూడా  ఉంటుంది. మహా విష్ణువు ఆలయానికి ఉదయం వెళ్ళాలట. శ్రీ మహా విష్ణువు స్థితి కారుడు కనుక రోజులో వచ్చే సమస్యలను దూరం చేస్తాడని భక్తుల నమ్మకం.

అదే శివాలయానికి అయితే సాయంత్రం సమయంలో వెళ్ళితే మంచిది. మహా శివుడుని రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు పలితం వస్తుంది. ఆ మహా శివున్ని భక్తితో ప్రశాంతంగా  కోరికలను కోరితే నెరవేరతాయి.

*సనాతన హిందూ ధర్మము*✍

మేము భారతీయలం సనాతన ధర్మాన్ని ఆచరిస్తాం.

హిందువులు మొదటి ఆదారం బొట్టు కాటుక భారతీయతకు కుంకుమ ఆస్తి కుంకుమ నుదుట ఎర్రటి కుంకుమ పెట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగం.

గతంలో హిందువుల్లో ఏ కులం వారైనాసరే తప్పకుండా నుదుటన కుంకుమ ధరించేవారు.

ముఖ్యంగా శైవులు, వైష్ణవులైతే కుంకుమ ధరించడం తప్పనిసరి.. అలా కుంకుమ ధరించడం గొప్పదనంగా భావించేవారు. ఆస్తికుల ముఖం మీద చెరగని ఆస్తిగా కుంకుమ భాసించేది.

ఈ ఆధునిక యుగంలో తప్ప శతాబ్దాలుగా ప్రతి ఒక్క హిందువు ముఖం మీద కుంకుమ తప్పకుండా వుండేది.
అది కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా వర్ధిల్లింది.

హరిచందనాన్ని, మంచి గంధాన్ని, విభూతిని, ఎర్రటి కుంకుమను నుదుటన ధరించడం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వచ్చింది.

సృష్టిలో మొదటిరంగు ఎరుపు కాబట్టి కుంకుమ ఎర్రటి రంగులో ఉంటుందట. ఎరుపురంగు లక్ష్మీప్రదమని కూడా అంటారు.

                   నాడులు కలిసే కీలక ప్రదేశంలో
మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నాడులు సక్రమంగా పనిచేయాలి. శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు వుంటాయి. వాటిలో ఒకటి ‘ఇడ’ రెండోది ‘పింగళ’. ఈ రెండు నాడులూ నుదుటి వద్ద కలుస్తాయి. అంటే శరీరంలోని నాడులన్నింటికీ అనుసంధానం నుదుటన వుందన్నమాట. ఈ ప్రదేశాన్ని ‘సుషుమ్న’ నాడిగా పిలుస్తారు.

ఇక్కడ కుంకుమగానీ, గంధం గానీ, విభూదిగానీ ధరించడం వల్ల నాడుల పనితీరు సక్రమంగా వుంటుందన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే కుంకుమ ధరించడం వల్ల దృష్టిదోషం తగలదట. కుంకుమ ధరించిన వ్యక్తులకు ఎదుటి వ్యక్తులు మానసికంగా లొంగిపోతారట. అలాగే కుంకుమకున్న ఎర్రటి రంగు మనలో మనోశక్తి, త్యాగనిరతి, నిర్భయత్వం, పరోపకార గుణాన్ని పెంపొందిస్తాయన్న అభిప్రాయాలు వున్నాయి.
                                      పవిత్రతకు చిహ్నం

పురుషులు కుంకుమ ధరించడం పవిత్రతకు, ఆస్తికత్వానికి, ధార్మికత్వానికి సంకేతంగా భావిస్తారు.
అదే స్త్రీలకయితే పై అంశాలకు తోడు సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా కూడా భావిస్తారు.

అనాది నుంచి హిందువులకు ప్రధాన అలంకార ప్రక్రియ కుంకుమ పెట్టుకోవడం అనే అభిప్రాయాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని కొన్ని గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. కుంకుమను భారతీయతకు చిహ్నంగా భావిస్తారు.

*** దూరదర్శన్‌లో చూసే బధిరుల వార్తల్లో ‘ఇండియా’ అనే సందర్భం వచ్చినప్పుడు ఆ న్యూస్‌రీడర్ నుదుటన కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో మధ్యవేలుని చూపిస్తుంది. అది కుంకుమకి, భారతదేశానికి ఉన్న బలీయమైన బంధాన్ని సూచిస్తుంది. ***

ఈమధ్యకాలంలో పురుషులు కుంకుమ పెట్టుకోవడం మానేశారు. కొంతమంది మహిళలు కూడా మానేశారు. ఈ ధోరణి ఎక్కడకి దారితీస్తుందోనన్న ఆందోళనను సంప్రదాయ వాదులు వ్యక్తం చేస్తూ వుంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద వుంటుంది.

హిందువులు తమ సంప్రదాయానికి దూరంగా వెళ్ళిపోవడం, కుంకుమను విస్మరించడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సంప్రదాయం ప్రకారం గా భోజన విధానం…!

సంప్రదాయం ప్రకారం గా భోజన విధానం…!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

1. భోజన సమయం లో చేయకూడనివి
భగవంతుడిని ఉపాసించే సమయంలో కాళ్ళూ చేతులూ కడుక్కుని, పరిశుద్ద వస్త్రాన్ని కట్టుకుని, సావధాన చిత్తంతో వ్యవహరించినట్లుగానే, భోజనం చేసే సమయంలో కూడా అంత శుచిగానూ, శాంతం గానూ వ్యవహరించాలని మన శాస్త్రాలు నిర్దేశించాయి.  అవి చెప్పిన భోజన నియమాల ప్రకారం తలమీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని, పాగా చుట్టుకుని భుజించ కూడదు.  కుర్చీ మీద కూచుని భుజించకూడదు.  భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు.  తోలు మీద కుర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతిలో ధరించి కానీ భుజించ కూడదు.

పగిలి పోయిన పళ్ళాల్లో భుజించ కూడదు.
కలసి భోజనం చేయాల్సిన సందర్భాలలో ఇతరులు తనకోసం నిరీక్షించేలా చేయకూడదు.

కలసి భోజనం చేస్తున్నపుడు ముందస్తుగానే ముగించి, ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు.
ఏక వస్త్రంతో భుజించరాదని అంటుంది దేవల స్మృతి.
ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరి చూపులూ పడేట్లుగా భుజించ కూడదు.  తలుపులు వేసుకోవాలి.  కనీసం పరదాలు వేసుకోవాలి. దృష్టి దోషం ఎంతటి వారిని అయినా కుంగదీస్తుంది.

బజార్లలో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు.  వాటిపై ఆకలిగొన్న మనుషులు, పశువులు మొదలైన వాటి దృష్టి పడి ఉండవచ్చు.  పడవలో, భుజించ రాదనీ ఆపస్తంబ మహర్షి రాశారు.

అలాగే చాప మీద కూచుని కూడా భుజించ కూడదు.  అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్ళన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని బ్రహ్మ పురాణం పేర్కొంది.

చెరకు, క్యారట్, పండ్లు మొదలైన ఏ పదార్థమైనా సరే పండ్లతో కొరికి, బయటకు తీసి తిరిగి తినరాదు.

ఆవు నెయ్యితో తడప కుండా ఆహారాన్ని తినకూడదు.
విక్రయాన్నం తినకూడదని శంకలిఖిత స్మృతి శాసించింది. 

నేడు హోటళ్ళలో తినేవన్నీ విక్రయాన్నాల కిందకే వస్తాయి.  ఒకసారి వండిన దాన్ని, కొంతసేపటి తర్వాత తిరిగి వేడి చేసి, వడ్డించడం లాంటివి ఈ హోటళ్ళలో పరిపాటి.

భుజించేటప్పుడు కామ క్రోధాదులు, హింసా వైరాల వంటి వాటికి మనసులో చోటుండ కూడదు.

సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పేది
సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు
రెండు చేతులతో తల గీరుకోరాదు
అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును
ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు
ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను
గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు
గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు
గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు
సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం లక్ష్మి కటాక్షము. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం లక్ష్మి లోగిలోకి రావడానికి దోహదం
చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు
ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమలు

1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.

2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.

3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.

4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.

5)దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.

6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.

7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.

10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.

12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.

14)ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.

15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

16)నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.

17)జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.

18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.

19)ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles