Showing posts with label చరిత్ర. Show all posts
Showing posts with label చరిత్ర. Show all posts

Tuesday 17 January 2017

శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు

*కుదిరితే పరిగెత్తు*.. ,
*లేకపోతే నడువు*...
*అదీ చేతకాకపోతే*...
*పాకుతూ పో*.... ,
*అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు*...

*ఉద్యోగం రాలేదని*,
*వ్యాపారం దెబ్బతినిందని*,
*స్నేహితుడొకడు మోసం చేశాడని*,
*ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని*...
*అలాగే ఉండిపోతే ఎలా*?

*దేహానికి తప్ప*,
*దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే*...   
*తలుచుకుంటే*...
*నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా*...
*నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది*,
*అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా*?

*సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు*...,
*పారే నది*..,
*వీచే గాలి*...,
*ఊగే చెట్టు*...,
*ఉదయించే సూర్యుడు*....
*అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా*....,,
*ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు*..

*లే*...
*బయలుదేరు*...
*నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో*... ,
*పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు*...

*నువ్వు పడుకునే పరుపు*...
*నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్*... ,

*నీ అద్దం*....
*నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో*... ,

*నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్*..

*మళ్ళీ చెప్తున్నా*.....!
*కన్నీళ్ళు కారిస్తే కాదు*....
*చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో* ..!

*చదివితే ఇవి పదాలు మాత్రమే*,
*ఆచరిస్తే*...
*అస్త్రాలు*.

Friday 13 January 2017

తులసి మొక్క ప్రాధాన్యత

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.

కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.

తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఈ మధ్యే దృవీకరించారు.

మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .

కలలలో శ్రీసాయి - 4వ.భాగం

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

కలలలో శ్రీసాయి - 4వ.భాగం

శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయంలో బాబా తన భక్తుడయిన బాలారాం మాన్ కర్ కి మశ్చీంద్రఘడ్ వెళ్ళి రోజుకు మూడుసార్లు ధ్యానం చేయమని సలహా ఇచ్చారు.  తాను సర్వత్రా నిండి ఉన్నానని నిరూపించడానికి బాబా అతనికి సశరీరంగా దర్శనమిచ్చి బాలారాం తో "నేను ఒక్క షిరిడీలోనే ఉన్నానని అనుకొంటున్నావు.   ఇపుడు  నన్ను చూస్తున్న రూపానికి, షిరిడిలో చూసిన రూపానికి నువ్వే సరిపోల్చుకో. షిరిడీలో చూసిన రూపానికి, యిచ్చట మశ్చీంద్రఘడ్ లో చూసిన రూపానికి, నా చూపులకి ఆకారానికి ఏమన్న భేదమున్నదా?" అని అడిగారు.  దీనిని బట్టి మనం గ్రహించవలసినదేమిటంటే బాబా ఒక్క షిరిడీలోనే ఉన్నారని అనుకోరాదు.  ఆయన చెప్పినట్లుగా బాబా ఎక్కడ ఉంటే అదే షిరిడి. 

శ్రీసాయి సత్ చరిత్ర 30వ.అధ్యాయంలో బొంబాయిలోని పంజాబీ వ్యక్తి రాం లాల్ కి బాబా స్వప్నంలో మహంతుగా కనిపించి షిరిడీకి రమ్మని చెప్పారు.  వణి గ్రామంలోని సప్తశృంగి దేవాలయ పూజారి కాకాజీ వైద్య కలలో దేవతగా దర్శనమిచ్చి షిరిడీకి రమ్మని పిలిచారు. 

ఈవిధంగా బాబాతన భక్తుల స్వప్నాలలో దర్శనమిచ్చి వారిని షిరిడీకి రప్పించుకొన్నారు.

1918వ.సంవత్సరం అక్టోబరు 15వ.తారీకున బాబా మహాసమాధి చెందారన్న విషయం మనకు తెలుసు.  అక్టోబరు 16వ.తారీకు వేకువఝామున బాబా పండరీపూర్ లో ఉన్న దాసగణు కలలో కనిపించి "ద్వారకామాయి కూలిపోయింది.  వర్తకులందరూ నన్ను చాలా చికాకులు పెట్టారు.  అందుకనే నేను యిక్కడినుండి నిష్క్రమించాను.  నీకు ఈవిషయం తెలియచేయడానికే నేనిక్కడికి  వచ్చాను.  వెంటనే నువ్వక్కడికి వెళ్ళి నాశరీరాన్నంతా పూలతో కప్పు" అని చెప్పారు.  దాసగణు షిరిడీకి వచ్చి బాబాకు పూలదండలు వేసి ఆయన చెప్పినట్లుగానె బాబా శరీరాన్నంతా ఎన్నోపూలతో కప్పాడు.  బాబా దేహాన్ని పూవులతో పూజించి రోజంతా సాయి నామాన్ని జపిస్తూ కూర్చున్నాడు.  బాబాకు అంత్యక్రియలు పూర్తయిన తరువాత దాసగణు బీదలకు అన్నదానం జరిపించాడు.      

తన భక్తుల మదిలో కలిగే సందేహాలకు బాబా యితర భక్తులద్వారా పరోక్షంగా సమాధానాలు చెప్పేవారు. శ్రీసాయి సత్ చరిత్ర 45వ.అధ్యాయంలో బాబా ఆనందరావు పాఖడే కలలో కనిపించి కాకాసాహెబ్ దీక్షిత్ కు భగవంతునిపై భక్తి అనే విషయంలో కలిగిన సందేహాన్ని నివృత్తి చేశారు.    

శ్రీసాయి సత్ చరిత్ర 48వ.అధ్యాయాన్ని గమనిద్దాము.  అక్కల్ కోట నివాసి న్యాయవాది అయిన సపత్నేకర్ ఒక్కగానొక్క కొడుకు 1913వ.సంవత్సరంలో గొంతువ్యాధితో మరణించాడు.  ఈసంఘటనకి సపత్నేకర్ దంపతులు చాలా కృంగిపోయారు.  ఒకసారి సపత్నేకర్ భార్య కలలో లకడ్ షా వద్దనున్న బావిలో నీరు తోడుతూ ఉంది.  బాబా ఆమె వద్దకు వచ్చి "ఎందుకు కలత చెదుతావు?  నీకుండను నేను స్వచ్చమయిన నీటితో నింపెదను" అని దీవించారు.

 

చనిపోయిన ఆమె కొడుకు ఆత్మను బాబా తిరిగి ఆమె గర్భంలోనికి ప్రవేశపెట్టారు.  1914వ.సంవత్సరంలో బాబా అనుగ్రహంతో సపత్నేకర్ దంపతులకు కుమారుడు జన్మించాడు.   

శ్రీసాయి సత్ చరిత్ర 47వ.అధ్యాయంలో బాబా గౌరికి కలలో మహదేవునిగా దర్శనమిచ్చి, ఆమెను భర్త అనుమతితో తండ్రియిచ్చిన నగలను అమ్మి వచ్చిన ధనంతో దేవాలయం మరమ్మత్తుల కోసం విరాళం యిమ్మని చెప్పారు.  ఈవిధంగా బాబా తన భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి వారికి మంచి సలహాలు, సూచనలు యిస్తూ ఉండేవారు.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Thursday 12 January 2017

'‘అగ్ని సాక్షిగా’’ వివాహం ఎందుకు చేస్తారు..?


‘‘సోమ: ప్రధమో వివిధే, గంథర్వో వివిధ ఉత్తర:''
త్రుతీయాగ్నిష్టే పతి: తురీయప్తే మనుష్య చౌ:''
అని వివాహ సమయంలో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తర్వాత గంధర్వుడూ ఆ తర్వాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానికి గా నేను నిన్ను ఏలుతాను అని అర్ధం.
అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు(చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన.
 వయస్సు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు.
‘‘లావణ్యవాన్ గంధర్వ:'' అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందాన్ని ఇచ్చేసినా పనయిపోయిందిఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. ‘‘అగ్నిర్వై కామ కారక:'' అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని)ప్రవేశ పెడతాడు.
ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణమని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది.
ఇప్పుడు ఆమె వివాహానికి యోగ్యురాలైనది. ఇప్పుడు అగ్ని, వాయు, చంద్రు,ఆదిత్య, వరౌణులను పిలిచి 'దదా మీ త్యగ్ని ర్వదతి' - అంటే ఇంక ఈ కన్యను వరునికి ఇవ్వదలచుకున్నానయ్యా అంటాడు అగ్ని. వెంటనే వాయు, చంద్రాదిత్యవరుణులు తమ అంగీకారాన్ని తెలుపుతాడు. అంటే అమ్మాయి వివాహానికి యోగ్యురాలైనది. ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్లాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను ‘‘అగ్ని సాక్షిగా'' వరుడు స్వీకరిస్తాడు.
చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వసాక్షిగా ఆ, అగి ఈమెను రక్షించగా, అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు ఈ అమ్మాయిని. అందుకని 'అగ్ని సాక్షిగా పెళ్ళి' అనే మాట వచ్చింది.

బ్రహ్మం గారి కాలజ్ఞాన అంశాలు

1)వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
2)రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
 3)శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
 4)పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
  5)బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
 6)చోళమండలం నష్టాలపాలౌతుంది.
    వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
  7)ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు.కొడలు మండుతాయి.
    8)జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
    9)దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
    10)మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
    11)అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
    12)నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
    ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
    13)మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
    14)పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
    15)ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
    16)వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
    17)ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
    18)చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
    19)కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
    20)ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
   21)ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
    22)వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
    23)కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
    24)తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.
 25)ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
    26)పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
    విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
    27)రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
    28)శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
    29)శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు)రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
    30)సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
    31)విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
    32)గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
    33)సూర్య్డు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
  34)నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
     35)విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
   36)ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
   37)కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
  38)బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
39)నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను.

నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.
    40)ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
    41)14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
    44)నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
    45)5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
    46)కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లా

డుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.
    47)కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
    48)మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
    49)పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
    50)పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
    51)బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
    52)గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు.ఆ తరువాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
    53)అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.
    54)గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
    55)మహానంది మరుగున మహిమలు పుడతాయి.
    56)నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
    56)మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
    57)కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.
    58)ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
    59)పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
    60)కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
    61)కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
    62)ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
    63)పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
   
64)రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
  65)శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
    66)ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
    67)వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
    68)విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.

ఇలా బ్రహ్మంగారు కడపనవాబుకు కాలజ్ఞానంబోధించి, మంత్ర దీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు.
పుష్పగిరిసవరించు

    నేను కలియుగం 5,000 సంవత్సరంలో వీరభోగవసంత రాయలుగా దుష్ట శిక్షణా, శిష్టరక్షణార్ధం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి.
    నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులౌతారు.
    వేదములు అంత్య జాతుల పాలౌతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.
    బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంటభూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు ఔతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను.
    నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపసు చేసి అక్కడ మహామునులను, మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లిఖార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో రెండు రోజులుండి అక్క

డి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమినాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను.
    నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు, అజ్ఞానులై కొట్టుకు చస్తారు.
    నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు.
    కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి.
    నేను వచ్చేసరికి విధవావివాహాలు జరగటం మామూలై పోతుంది.
    వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు.
    అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.
    నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరపతులు పాడయ్యేను.
    నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగేను. శృంగేరి,పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలౌతాయి.
    ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
    హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.
    అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
    నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
    వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
    శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4,999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం ఔతుంది.
    శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణ గణ'మని గంటలమోత వినబడుతుంది.
    బ్రమరాంభ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యం అవుతుంది. బ్రమరాంభ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్లనుండి పాలుకారుతాయి.
    కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమౌతుంది.
    సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలుపూచి, కాయలుకాచి,పండ్లు పండి వెనువెంటనే మాయమౌతుంది.
    శిరువెళ్ళ నరశింహుని దుట గంగిరావిచెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
    బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు,పాలిండ్ల పాలూ కారుతాయి.
    శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555నాటికి వివిధ దేశాలలో జననష్టం కలుగుతుంది.
    పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరు రూపు మాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారి పోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించేను.
    స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులూ, చెరువులూ, నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు.

పంచాననంవారికి జ్ఞానబోధసవరించు

    మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
    నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణసంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులంవారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్దులూ యోగులూ జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణసంకరమౌతుంది.
    ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమౌతాయి.
    కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది.
    రాజాధిరాజులు అణిగి ఉంటారు. శూద్రులు వలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మీ నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కానివారి నెత్తురు భూమి మీద పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది.
    చీమలుండు బెజ్జాల చోరులు దూరుతారు. స్త్రీలందరూ చెడుతలపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది. గడగ్ లక్ష్మీపురం, రాయచూర్, చంద్రగిరి అలిపేది, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోలుకొంక్ల్డల్క్ల్క్ల్ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలననేంద్రియములు, ఆయుధాలచేత బాణముల వల్ల నశిస్తారు.

గతజన్మ వృత్తాంతంసవరించు

ఒకకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో "స్వామీ! మీరు గతంలో త్రేతా, ద్వాపర యుగంలో కూడా జన్మించానని చెప్పారు. మీ పూర్వ జన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా?" అని అడిగాడు. బదులుగా బ్రహ్మంగారు "నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను. అని తన పూర్వ జన్మల గురించి చెప్పడం ప్రారంభించారు.

"బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేసాను. ఆ తరువాత వెండి కొండ మీదకు వెళ్ళి 54 బ్ర

హ్మ కల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసనమును నిర్మించి 290 బ్రహ్మ కల్పాలు విష్ణు సేవ చేశ్శాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు 'పంచవిద ముక్తి' అనే వరం ఇచ్చాడు. ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంధములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను. వీటి ఫలితంగా నేను అకాలమృత్యువును జయించే శక్తిని సంపాదించాను. ఆ తరువాత నా యోగబలం వలన దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆతరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుతున్నాను విను. మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మ కల్పాలు ఉన్నాను, మూడవ అవతారంలో 1,09,00,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. నాల్గవ అవతారములో 1,00,01,317 కల్పాలు ఉన్నాను. అయిదో అవతారంలో 4కోట్ల పదఞాలుగు లక్షల 55 వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను. ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మ కల్పాలు ఉన్నాను. ఏడవ అవతారంలో 27,63,03,400 బ్రహ్మ కల్పాలు జీవించాను. ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో 70 లక్షల బ్రహ్మ కల్పాలు జీవించాను. ఇప్పుడు బనగాన పల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపసు చేశాను. వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను."

    నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమౌతుంది.
    ఆ తరువాతకాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమౌతుంది.
    శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు.
    పల్నాటిసీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు.
    మొగలాయి రాజ్యాన ఒకనది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది.
    వ్యభిచార వృత్తి అంతరించి పోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు.
    గురువులు ఆడంబరంగా జీవిస్తారు.
    కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి, తండ్రి, పిల్లలు మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది.
    నారాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారం నాధ్ర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు. అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించాడు.

కర్నూలు నవాబుకు జ్ఞానబోధసవరించు

    క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది.
    చండిపూర్,అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులై పోతారు.
    నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
    అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు.కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
    తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్ధాలు పుడతాయి.
    ఈశ్వరమ్మని రంగరాజుకు ఇచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో పన్నెండామడల పట్నం ఔతుంది. నా భక్తులు యావన్మంది ఇక్కడకు వచ్చి కల్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం. ఈ కాలజ్ఞానం విని నవాబు బ్రహ్మంగారికి అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.

పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధ
భార్య గోవిందమ్మకు జ్ఞానబోధసవరించు

వైశాఖ శుద్ధ దశమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు. ఇది విని విలపిస్తున్న గోవిందమ్మను పిలిచి "నాకు మరణం లేదు నీకు వైధవ్యంలేదు. నీవు సుమంగళిగా జీవించు. నేను సమాధినుండి వీరభోజ వసంతరాయలుగా వచ్చి నాభక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను" అని బ్రహ్మంగారు చెప్పాడు.

    బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
    మాహాలక్ష్మమ్మ నృత్యంచేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
    కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది.
    కంచి కామాక్షమ్మ కంట కన్నీNiరు కారుతుంది.
    కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.
    అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించి పోతుంది.

స్వామి వివేకానందుని స్ఫూర్తి వచనాలు

👬 *జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు*👬


😊 *స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా  దివ్య ప్రబోధాలు*😊


గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగ్రుతులు కండి.

దీర్ఘ (?) అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.



ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.


మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.



మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..

ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.

కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు

మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.


ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది..

స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం)

అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు

👉అసలు పేరు : నరేంద్రనాథ్ దత్తా

👉జననం : 12 జనవరి 1863, కలకత్తా,

👉నిర్యాణము : జూలై 4, 1902 (వయసు 39)

👉స్థాపించిన సంస్థ : బేలూరు మఠం, రాష్ణకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్

👉గురువు : రామకృష్ణ

👉తత్వం : వేదాంతం

👉సాహిత్య రచనలు : రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ

*👌🌷●స్వామి వివేకానందుని స్పూర్తి వచనాలు●🌷👌*


◆మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు.

◆ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.

◆కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.

 ◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.

◆ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.

◆ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

◆కళింకిత హృదయులకు ఆధ్యాత్మిక వికాసం ఉండదు.

◆తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి.

◆దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.

◆జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది

◆దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.

◆పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను.

◆పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.

◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది
ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.

◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.

◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.

◆మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.

◆మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.

◆విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.

◆వేదకాలానికి తరలిపోండి.

◆సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.

◆సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.

◆విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.

◆తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు.

◆విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం.

◆ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

◆జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు.

◆జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది.

◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.

◆టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది.
డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.

◆చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.

◆విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

◆విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం.

◆మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.

◆అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.

◆స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.

◆సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.

◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.

◆భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.

◆మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.

◆మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది.

◆సహాయం అందుతుందనీ భావించేవారు మాత్రమే పని చేయ గలరు, ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక.

◆దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు.

◆ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవిం లేడు.

◆పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి.

◆నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది.

◆పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది. ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆర్తనాదం చేస్తుంది.

◆ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.
1.సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం
2.అసూయ,అనుమానాల రాహిత్యం
3.సజ్జనులుగా మెలగాలనీ,మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం.

◆మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం.

◆ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.

◆అపజయాలను లక్ష్య పెట్టకండి,అవి వాటిల్లడం సహజం, అవి జీవితానికి అందం చేకూరుస్తాయి.

◆అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.

◆బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు. బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న బలాన్ని గూర్చి వారికి బోధించండి.

◆ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.

◆మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.

◆ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు.

◆సంకల్పనశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే.నిర్మలం,బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి.

◆ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది.

◆స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.

◆ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం.

◆అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు.కాని అనేక సంవత్సరాలు కొట్టూమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.

◆జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి.

◆ఏది స్వార్ధపరమో అదే అవినీతి, స్వార్ధరహితమైనదేదో అదే నీతి.

◆పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలుచేడమే పూజలన్నింటి సారం.
దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే,అది వచ్చే తీరుతుంది.

◆ఈ జీవితం క్షణికమైనది,లోకంలోని ఆడంబరాలు క్షణ భంగురాలు.కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు.

◆నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.

◆నా సోదరులారా! మనం పేదలం,అనామకులం.కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి.

◆అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే.

◆ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల. మన మిచ్చటికి రావాడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Sunday 8 January 2017

భారతీయ గోవును ఎందుకు కాపాడాలి?

                         

న్యూజిలాండ్‌ దేశ ప్రముఖ ఆహార శాస్త్రవేత్త డా|| కీల్‌ఉడ్‌ఫోర్డ్‌ తమ జాతుల ఆవుపాలు విషపూరితాలని పేర్కొన్నారు. వీటిలో ”బీటి కాసోమార్ఫిన్‌-7 (బిసిఎమ్‌-7)” అనే విషపదార్థాలవల్ల జెర్సీ లాంటి జాతుల ఆవుపాలు మిక్కిలి అనారోగ్యకరమనీ, కాన్సర్‌ వంటి భయంకర రోగాలు కలుగుతాయనీ తెలిపారు. వీటికి ఏ-1 రకం పాలని పేరు పెట్టారు.
మరి ఏ-2 రకం పాలు భారతీయ గో జాతుల పాలు (మూపురం- సూర్యకేతు నాడి ఉన్న గో జాతులు) అనీ, ఇవి రోగాలను నాశనం చేసే శక్తి కలవనీ, విదేశీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ప్రస్తుతం మన భారతీయ గోజాతుల సంతతు లను (బ్రీడ్‌లు) వారి దేశాలకు తీసుకు పోతున్నారు. అంతేకాకుండా డా||ఎన్‌.గంగాసత్యం రచించిన ”అర్క్‌ తీసుకొండి- ఆరోగ్యంగా ఉండండి” అనే చిన్న పుస్తకం ప్రకారం (19వ పేజీలో) జెర్సీపాలు త్రాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి కేన్సర్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. అతి చిన్నదైన తైవాన్‌ దేశంలో, పాలలో ఉండే ఒక ప్రోటీన్‌ కేన్సర్‌ పెరుగుదలను నిరోధించగలదని వారి ప్రయోగాల గురించి ఒక వార్తా పత్రికలో వచ్చింది. ఒక దేశవాళీ జాతి గోమూత్రంలో బంగారం ఉన్నదనీ, దానికై ప్రయోగాలు అధికం చేస్తున్నట్లు ఈ మధ్యనే దిన పత్రికలలో ప్రచురించబడింది. ప్రపంచం అంతా మన గోజాతుల పాల గురించి కోడై కూస్తుంటే, మనం మాత్రం శుప్తావస్థలో జోగుతూ ఉన్నామంటే – ఎవరైనా నవ్వుతారు.
బ్రెజిల్‌ వంటి దేశాలవారు 16 కోట్ల మన ఒంగోలు జాతి సంతతిని అభివృద్ధి చేసుకొని, తమ దేశ ప్రధాన ఆర్థిక వనరు గోవులే అని ప్రకటించు కొన్నారు. మరి మన దేశంలో, రాష్ట్రాలలో ప్రధాన ఆర్థిక వనరులు ఏవో మనకు తెలుసు. ప్రముఖ న్యాయస్థానాలు కూడా ”మద్యం ప్రవాహం లేకుండా ప్రభుత్వాలు పరిపాలన చేయలేవా?” అని ప్రశ్నించిన ఉదాహరణలున్నాయి. ”అమూల్‌ బ్రాండ్‌”తో ప్రపంచ దేశాలకే పాఠం చెప్తూ-భారతీయ శక్తిని, హరిత విప్లవం, శ్వేత విప్లవం (గ్రీన్‌ వైట్‌ రివల్యూషన్స్‌) ద్వారా చాటి చెప్పిన మేటి వ్యక్తి డా||వర్గీస్‌ కురియన్‌ను మరల గుర్తు చేసుకోవలసిందే.
ప్రపంచంలోనే అతిపెద్ద గోశాల సౌదీలో వుందిట. అనేక ముస్లిం దేశాలలోను, బ్రెజిల్‌ వంటి దేశాలలోను గో సంరక్షణ, గో జాతుల ఉత్పత్తి చేస్తూ ప్రపంచ రికార్డులను ప్రదర్శిస్తున్నారు. ఏ మత గ్రంథాలలోను గోవులను వధించమని, భక్షించమని లేదనీ ప్రపంచ ప్రసిద్ధ విద్వాంసులందరు తెలియ జేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎమ్‌.ఎల్‌.ఏ. జమీరుల్లా ఖాన్‌ గోమాత రక్షణకు నడుంకట్టినట్లు పత్రికలలో చదివాము. కొన్ని ముస్లిం మతసంస్థలు కూడా గోవధ చేయరాదనీ, దానికి తాము కూడా వ్యతిరేకమే అనీ ముందుకు వస్తున్నాయి. ఒక ప్రముఖ వార్తా పత్రిక తమ విశేష సంచికలో ఒక ఆవు 10 ఎకరాల బీడు భూమిని సస్యశ్యామలం చేయగలదనీ, 300 రకాల రోగాలను నయం చేయగలదనీ, 3,00,000 రూపాయల జాతీయాదాయాన్ని పెంచుతుందనీ తెలిపారు.
జంతు జాతులన్నింటిలో గోవు విశిష్టతను గూర్చి శాస్త్రకారులు ఎప్పటి నుండో తెలియజేస్తున్నారు. తిలక్‌,గాంధీ, మదన్‌మోహన్‌ మాలవీయ, అంబేడ్కర్‌ వంటి ఎందరో జాతీయ నాయకులు మన దేశ మూలాలు, గోవులో ఉండే పవిత్ర, ధార్మిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ సంబంధాన్నీ, శక్తినీ తెలియజేస్తూ – స్వతంత్ర భారతములో సంపూర్ణ గోవధ నిషేధాన్ని ఆశించి, రాజ్యాంగంలో పొందుపరిచారు.
నిత్య జీవితంలోనూ పతంజలి – రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌, గో బ్రాండ్‌ ఔషధాలు వాడటం ద్వారా అన్ని మతాల, కులాల, వర్గాలవారు వారి ఆరోగ్య విషయాలలో ప్రయోజనాలు పొందుతున్న ఉదాహరణలు కోకొల్లలుగా వున్నాయి. హైద్రాబాద్‌ నేటి మేయర్‌ – బొంతు రామ్మోహన్‌ మాతృమూర్తి గో మూత్రం వాడటం ద్వారా కేన్సర్‌ జబ్బు నుండి విముక్తమై ఆరోగ్యంగా ఉన్నట్లు తెలియజేసారు. ”అమృతవర్షిణి కథావీధి” అను చిరుపుస్తకంలో ప్రముఖ విద్యావేత్త చిట్టా దామోదర శాస్త్రి ఈ మధ్యకాలంలో జరిగిన నిజ జీవితపు ఉదాహరణలు, గోమాత శక్తినీ, వైద్యపరంగా దాని విశేషతలను తెలియజేసారు. కిడ్నీల మార్పు అవసరంలేకనే రోగి ఆరోగ్యం గో మూత్రము, పంచగవ్య చికిత్సలద్వారా బాగుపడిన ఉదాహరణలు డాక్టర్లకే ఆశ్చర్యమును కలిగించేవిగా ఉన్నాయి.
భైంసా మండలం ‘ఖోని’ గ్రామ నివాసియైన గంగాధర్‌ అనే ఉపాధ్యాయుడు 28 ఎకరాల మొత్తం పొలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. గతంలో లక్షాముప్ఫై వేల రూపాయల ఎరువు మందులు, పురుగుమందులు వాడేవాడిననీ, కానీ ఈ రోజు ఒకపైసా కూడా ఖర్చు చేయట్లేదనీ తెలిపారు. అంతేకాకుండా అందరికంటే ఎక్కువ పంటదిగుబడి సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ, ఆ లక్షా ముప్ఫైవేల రూపాయలు ప్రారంభంలోనే మిగిలాయి అని సంతోషంగా తెలిపారు. ఇలాంటి రైతులు అనేక మంది గో ఆధారిత వ్యవసాయం చేస్తూ, ఆదర్శ రైతులుగా రసాయనిక విషాహారం కాని అమృతాహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
”సోషల్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ స్పిరిట్యుయాలిటీ” అంటే సమాజానికి ఆధ్యాత్మికతను అనువర్తించడం. ఆధ్యాత్మికత సామాజిక అనువర్తి భారతీయ సంస్కృతిలో అడుగ డుగునా కనిపిస్తుంది. అలాంటి జాతీయ మూల తత్వాన్ని స్వాతంత్య్రం వచ్చాక దెబ్బకొట్టే ప్రయత్నం జరిగింది. బూజు పదార్థం కూడా అనుభవజ్ఞుల చేతిలో పడితే ప్రజోపయోగ కరమైన ”పెన్సిలిన్‌” తయారైంది. భారతీయ దార్శనికులు, ఋషులు చెప్పిన ఆ మూలాలే మన సంస్కృతినీ, జాతినీ పరిరక్షించాయి. గోరక్షణ- దేశ రక్షణ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మహాత్మా గాంధీ తెలిపారు. ఇంతటి మ¬న్నత లక్షణా లున్న మన గోమాతను కాపాడుకోవటం మనందరి బాధ్యత.
ఇప్పటికే దేశంలో నగరాలు, పట్టణాలలోనూ దేశీ గోవుల స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి, వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా శ్రద్ధ చూపిస్తే మంచి దేశీ గో- సంతతులను అభివృద్ధి చేయుటం వేగవంతమవగలదు.
గో సంరక్షణ- గోవధ నిషేధానికి సంబంధించి ప్రభుత్వ- రాజ్యాంగ చట్టాల గురించి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ లేఖలు వ్రాసినట్లుగా 10.08.2016 నాటి దినపత్రికలలో చదివాము. 7వ షెడ్యూల్‌లోని 15వ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా గుర్తుచేస్తున్నట్లు చదివాము. దేశంలోనే అతిపెద్ద గోవధశాల తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న సంగతి మరవలేము. గతంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, సైబరాబాద్‌ పోలీస్‌కమీషనర్‌ వంటివారు ఈ విషయమై నిర్దిష్ట ఉత్తర్వులనూ క్రింది శాఖలవారికి ఇచ్చారు. కనుక మన ప్రభుత్వం జిల్లాల అధికారులతో గో సంరక్షణ, గోవధ నిషేధ చర్యలు ప్రారంభిస్తే, కొన్ని లక్షల గోవధలను ఆపిన పుణ్యం ప్రభుత్వానికి దక్కుతుంది. బంగారు తెలంగాణ కూడా గోవులతో సాకారమవు తుంది.

అసలు బీబీ నాంచారమ్మ ఏవ్వరు. ...?


ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారుండరు. అలాగే చాలామందికి బీబీ నాంచారమ్మ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగానే ముస్లిం వనితయా? ఆమె దైవస్వరూపం ఎలా అయ్యారు?

 ఆమె కధ ఏమిటో చూద్దాం.

బీబీ నాంచారమ్మ! `నాచియార్` అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంటే భక్తురాలు అని అర్థమట. ఇక `బీబీ` అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు. కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది. పురాతన కధ ప్రకారం బీబీ నాంచారమ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుంది కదా అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తిన కి బయలుదేరాడు.
హస్తిన కి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా, దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం… అలా తనకు తెలయకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ దాని మీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు. చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తిన కి ప్రయాణమయ్యారు.
రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలు చూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయితే అర్చకులు, ఆమె ఆదమరిచి నిదురించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఒదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు.
మరొక కధ ఏమిటంటే…ఆ విగ్రహం రంగనాథునిది కాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట. అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ !

Tuesday 3 January 2017

జననీ జన్మ భూమిశ్య స్వర్గాదపీ గరీయసీ’ అన్నదెవరు.?



రఘుకుల తిలకుడు, మానవ అవతారమెత్తి, పరిపూర్ణమైన మానవునిగా జీవించి, ధర్మ, అర్ధ, కామ, మొక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీ రాముడు రావణ సంహారము తర్వాత – తల్లీ,జన్మించిన ప్రదేశము స్వర్గంకన్న పరమ ఉత్తమము అయినది అని చెప్పాడు. లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన అనంతరము లంకలోకి ఐశ్వర్యమూ, బంగారము, వజ్రాల భవంతులకుశ్రీ రామునికి చూపించి, ‘ఆహా అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమనది…ఇక్కడే ఉండిపోవచ్చు కదా. .’ అని శ్రీ రాముడితో అంటే, ఆ సమయాన శ్రీ రాముడు మృదుమధురంగా ‘జననీ, జన్మభూమిశ్య, స్వర్గాదపి గరీయసి’ అని పలికాడు.

పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?


కల్యాణ గ్రహం

 సీజన్అందం.... ఆదాయం...
వంశం... వారసత్వం....
గుణం... గోత్రం...
వీటన్నింటికీ లెక్కలుంటాయి.
ఆ లెక్కలు సరిపోవు.
గ్రహం, రాశి, నక్షత్రం, ముహూర్తం....
ఈ లెక్కలు కూడా తేలాలట.
అవునంటారా? కాదంటారా?

మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.

వివాహానికి వధూవరుల జాతకాలలో పొంతన అవసరమా? పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?
ప్రపంచంలోని మిగతా దేశాలలో, మిగతా మతాల వారు జాతకాలు పట్టించుకోవడం లేదు కదా. అక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా. మరి హిందూ ధర్మంలోనే ఎందుకు? ఏయే జాతకాల అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఎవరెవరికి వద్దని శాస్త్రం చెబుతోంది?

ఇవి తరచూ తలెత్తే ప్రశ్నలు. కాని  అందమైన జీవితం కావాలంటే  జాతకాలు చూసుకోవాలి అంటున్నారు జ్యోతిష్యులు. వివాహానికి వధూవరుల జీవితాలలో పొంతన కుదరాలంటున్నారు. జాతకాలు కలిస్తే వారు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటున్నారు. వివాహాది శుభకార్యాలకు పునాది అయిన శ్రావణ మాసం మొదలు కానున్న సందర్భంగా ఈ విషయమై ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సెమినార్ కూడా నిర్వహించారు జ్యోతిష్య పండితులు. ఇంటా బయటా కొన్ని అభిప్రాయాలు...

కనీసం అరవై శాతం కలవాలి....
భూమి మీద ఉన్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని శాస్త్రాలు, సైన్సు అంగీకరించాయి. దీనిని కాదనడానికి లేదు. ఉదాహరణకు చూడండి. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి. కాని అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తాం. కారణం ఈ జాతక దోషాలే. వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలి. జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాసులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు,  వాటి మైత్రి... ఇలా అన్ని విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అని వివాహం నిర్ణయించాలి. విదేశాలలో, మన దేశంలో జాతకాలు చూడకుండా చేసుకున్న వివాహాలు జయప్రదంగా ఉన్నాయంటే అది పూర్వజన్మ సుకృతం. లేక కాకతాళీయంగా జాతకాలు కలిసే ఉంటాయి. నా అనుభవంలో ఇలాంటివి చాలా చూశాను.
            - గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష పండితులు

జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం
నవగ్రహాల ప్రభావం మన జీవితంలో 12 కోణాలుగా ఉంటుందని, జన్మించిన సమయంలో ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, మన జీవితంలో మంచిచెడులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రం సాధికారికంగా చెబుతోంది. కాబట్టి ఆ శాస్త్ర నియమాలను జీవితంలో ప్రధాన ఘట్టమైన వివాహానికి కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. భారత ఉపఖండంలో పుట్టి పెరిగేవారి కోసం ఇక్కడ భూమి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాలను, డిగ్రీలను బట్టి, ఫలితాలను నిర్ణయించే శాస్త్రం ఏర్పడింది. మనలాగే గ్రీకు దేశంలో జ్యోతిషం ఉంది. మన రాసులను వారు వేరు వేరు పేర్లతో పిలుస్తారు. జాతకాలు చూసేటప్పుడు నక్షత్రాలు ప్రధానం. ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుట్టారనేదాన్ని బట్టి చూస్తారు. అంటే అవతల వ్యక్తి గురించి ప్రాథమిక సమాచారం సేకరించడమన్నమాట. ఏ లగ్నంలో పుట్టారో, ఆ గ్రహం నుంచి లెక్కించాలి. జాతకాలు చూడకుండా వివాహం చేసినా కలసి జీవించవచ్చు. కోడి కూసినా కూయకపోయినా తెల్లవారుతుంది. అయితే కూసినప్పుడు లేవాలి అనుకుంటే, సరైన సమయంలో మేల్కొంటాం. లేదంటే ముందుగా కాని, ఆలస్యంగా కాని మేల్కొంటాం. జాతకం కూడా అంతే. జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం.
          - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పండితులు

శని ఉప్పు.... కుజుడు నిప్పు...
జ్యోతిష్యం హిందూధర్మం మాత్రానికే అని ఎవరన్నారు? అది ప్రపంచమంతా ఉంది. అరేబియన్లు, గ్రీకులు, చైనీయులు అందరూ నమ్ముతారు. అక్కడ కూడా జాతకాల మీద పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. యజమాని ఒక ఉద్యోగిని తీసుకునేటప్పుడు ఆ ఉద్యోగి తనకు అనుకూలుడో కాదో అని తెలుసుకోవడానికి కూడా జాతకం చూస్తారు. ఒక స్నేహితుడు మనకు తగినవాడా కాదా, ఒక ఊరు మనం నివసించడానికి యోగ్యమా కాదా అని చూస్తారు. కొడుకు జన్మించినప్పుడు వాడు శత్రువు అవుతాడా, మిత్రుడిలా ఉంటాడా అనే విషయం కూడా జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. నక్షత్రాలకు రాసులకు స్వభావం ఉంది. ఏ నక్షత్రానికి, ఏ నక్షత్రం సరిపడుతుందో చూసుకోవాలి. ఏ రాశిలో పుట్టినవారికి ఏ రాశివారితో సరిపోలుతుందో చూసుకోవాలి. శని ఉప్పులాంటివాడు. కుజుడు నిప్పు లాంటివాడు. ఉప్పు నిప్పు కలిస్తే మంట పెరుగుతుంది. గురువు చంద్రుడు ఒకచోట చేరితే సంతోషం, ఆనందం ఉంటాయి. కొన్ని నక్షత్రాలకు కొన్ని నక్షత్రాలే కలుస్తాయి. అగ్నితత్త్వం వారికి జల తత్త్వం వారితో పొంతన కుదరదు. ఒకరు ఊసురోమంటూ ఉంటే ఒకరు ఎగిరెగిరిపడుతుంటారు. మ్యాచింగ్‌లో ఇవన్నీ చూస్తాం. కనుక ఒక జంటకు వివాహం చేసేటప్పుడు ఆ ఇద్దరూ కలిసి జీవించగలిగే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి.
                 - భీమా సాంబశివరావు, జ్యోతిష పండితులు

కుజదోషం వల్ల ఇబ్బంది ఉంటుంది....

మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.   జ్యోతిష్యం అంటే గమనంలో ఉన్న ముళ్లను ఏరుకుంటూ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే దిక్సూచి. గతంలో పన్నెండేళ్లు నిండకుండానే వివాహాలు చేసేవారు. అందువల్ల నక్షత్రాలు చూసేవారు. మఖ మామగారికి, జ్యేష్ఠ బావగారికి, ఆశ్లేష అత్తగారికి గండం అనేవారు. ఇప్పుడు పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తరవాత చేస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్రాల ప్రస్తావన అనవసరం. నక్షత్రాలకు పరిష్కారం ఉంది, గ్రహాలకు లేదు. కుజుడు అగ్ని తత్త్వ కారకుడు. వివాహాన్ని పాడు చేయడానికి చూస్తాడు. దోషపరిహారం ఎంతవరకు ఉన్నదో చూడాలి. కుజదోషం వల్ల వియోగం, విరహం, కలహం కలుగుతాయి. కొందరు సమాజం కోసం కలిసే ఉంటారు. కాని వారి వైవాహిక జీవితం సరిగా ఉండదు. కొందరిలో మాత్రం సంతానం కలిగితే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబం బలపడుతుంది.  ఎవరి జాతకం వారు చూసుకోకుండా ఇంటికి రాబోయే అమ్మాయి జాతకం చూడటం సరికాదు. నక్షత్రాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, గ్రహాల అనుకూలత చక్కగా చూసుకోవాలి
    - విశ్వనాథ కనకమహాలక్ష్మి, జ్యోతిష, వాస్తు నిపుణులు

జీవి పుట్టుక ఏది?
జాతకాలన్నీ పుట్టిన తేదీ, సమయం ఆధారంగా రూపొందుతాయి. అయితే జీవి ఆవిర్భావం ఎప్పుడు? తల్లి గర్భంలో అండం- శుక్రకణాలు ఫలదీకరణ చెందినప్పుడే మనిషి జీవం మొదలవుతుంది. అదే అసలైన పుట్టుక. తల్లి గర్భం నుంచి బయటపడడం అనేది కొనసాగింపు మాత్రమే. జీవం ఎప్పుడు మొదలైందనేది రెండు-మూడు రోజుల తేడాలో ఒక అంచనాకు రావచ్చు. కానీ కచ్చితమైన సమయాన్ని చెప్పలేం. అలాంటప్పుడు జాతకాలు రాయడానికి ఏది ఆధారం? ఇప్పుడు ఎక్కువ డెలివరీలు సిజేరియన్‌లే. అది కూడా ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్‌లు చేయించుకుంటున్నారు. అలా పుట్టిన బిడ్డ జాతకం కచ్చితంగా బాగుండి తీరాలి కదా! అలాగే జరుగుతోందా? నవగ్రహాల ఆధారంగా జాతకాన్ని నిర్ణయిస్తారు. మరి సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు నీడలు. నాలుగు పోగా మిగిలినవి ఎన్ని? మరి నవగ్రహాలనే మాటకు తావెక్కడ? అయితే ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి మనోభావాలనూ గాయ పరచకూడదు. మన రాజ్యాంగం కూడా నమ్మకాలను ఆమోదిస్తోంది. నేను చెప్పే మరో విషయం  ఏమిటంటే... పెళ్లి చేసుకునే అబ్బాయి తన జాతకం మంచిదనే నమ్మకంతో ఉండడం తప్పుకాదు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని జాతకం కలవలేదని నిరాకరించవద్దు. జాతకం కలిసిందని ఇష్టం లేని అమ్మాయిని చేసుకోవద్దు. అన్ని రోజులు దేవుడు సృష్టించినవే అయినప్పుడు కొన్ని  మంచివి, కొన్ని  చెడ్డవి ఎందుకుంటాయి? అన్నీ మంచిరోజులే.
                 - డాక్టర్ బ్రహ్మారెడ్డి, జనవిజ్ఞానవేదిక స్థాపకులు

పంచభూతాలతో కనెక్షన్
జాతకమనేది ఫిజికల్ ఫిట్‌నెస్‌ని చూపుతుంది. ఇద్దరిలో ఎలాంటి పాజిటివ్, నెగిటివ్‌లు ఉన్నాయో చెబుతుంది. సంతానం కూడా తెలుస్తుంది. లోపాలు పసిగట్టవచ్చు. ఇగో ప్రాబ్లమ్స్ కూడా చూడవచ్చు. జాతకమంటే ప్రకృతి. ఒకరికి నీరు పడుతుంది, ఒకరికి ఎండ పడుతుంది. నీళ్లు జల్లితే అగ్ని ఆరుతుంది. అవే నీళ్లను అగ్ని మీద పెడితే సలసల మరిగి ఆవిరవుతాయి. పంచభూతాలకి, శరీర నిర్మాణానికి ఉన్న కనెక్షన్ జ్యోతిష్యం. హెచ్చుతగ్గులను ఎలా సవరించుకుని, పాటించాలో చెబుతుంది. చైనీయులు న్యూమరాలజీ నమ్ముతారు. అమెరికన్లు పుట్టినతేదీని ఆధారంగా చేసుకుని వివాహాలు నిశ్చయిస్తారు. వారు మనసుకి ప్రాధాన్యత ఇవ్వరు. శరీరాకృతి, ఆకర్షణలకు ప్రాధాన్యం ఇస్తారు.  మనదేశంలో అలా కాదు. మంచి కుటుంబమా కాదా అని చూస్తారు. ఇంటిపేరుని బట్టి సంబంధాలు నిశ్చయించుకుంటారు. కనుక శాస్త్రాన్ని పాటించడంలో తప్పులేదు.
                            --ఉషా అన్నపూర్ణ (ఎం.ఏ ఆస్ట్రాలజీ)

Saturday 31 December 2016

క్యాలెండర్ కధ ???

New year ...?
ఇంగ్లీషు సంవత్సరాది జర్పుకునేవారికి అభినందనలు. నేను మాత్రం ఉగాదినే మన నూతన వత్సరంకు ఆదిగా భావిస్తాను- శివ మాదిరెడ్డి
=======
క్యాలెండర్ కధ

ఈనాటి క్యాలండర్ కి తోలిరుపాలు ఏవని చూస్తే ముఖ్యము గా రోమన్ , ఈజిప్టు , గ్రేగేరియక్న్ విధానాల గురించి చెప్పుకోవాలి .

రోం సామ్రాజ్యాన్ని పాలించే రోమన్ చక్రవర్తి కాలం లో ఏడాదికి 304 రోజులుగా నిర్ణయించారు . వీటిని పది నెలలు గా విభజించారు . అప్పట్లో మార్చి తో కొత్త ఏడాది ప్రనంభంయ్యేది . ఆ తర్వాత క్రీస్తుపుర్వము ఏడో శతాబ్దము దగ్గరికి వస్తే రోమ్ ని పాలించిన "సుమా పామ్పిలియాస్ " ఏడాదిని 12 నెలలు గా విభజించాడు . రోజుల సంఖ్య ఏడాదికి 354 రోజులు గా చెప్పాడు . అయితే సరిసంఖ్యలు శుభకరం కావనే నమ్మకం తో ఒక రోజును కలిపి ఏడాదికి 355 రోజులు గా నిర్ణయించారు .

క్రీస్తు పూర్వము 153 లో ఏడాది ప్రారంభాన్ని మార్చి నుంచి జనవరికి మార్చారు . కాని చంద్రుడి గమనము , సూర్యుడు గమనము ప్రకారము చుస్తే ఏడాదికి రోజుల లెక్కల్లో తేడాలు ఉండేవి . ఈ గందరగోలాన్ని సవరించడానికి రోమన్ చక్రవర్తి " జూలియస్ సీజర్ " ప్రయత్నించారు . క్రీస్తు పూర్వము 46 లో ఈజిప్టు వెళ్ళిన ఆయన అక్కడ ఏడాది విభజించిన విధానాన్ని తెలుసుకుని రోమ్ లో అమలు చేశాడు . దాని ప్రకారము ఏడాదికి 365.25 రోజులు గా లెక్కగట్టారు . జనవరి , మార్చి , మే , జూలై , ఆగష్టు , అక్టోబర్ , డిసెంబర్ , నెలలకు 31 రోజులుగా ... ఏప్రిల్ , జూన్ , సెప్టెంబర్ , నవంబర్ నెలలకు ౩౦ రోజులుగా ఫిబ్రవరి నెలకి28రోజులుగా నిర్ణయించారు . అయినా పావురోజు మిగిలిపోయింది . . దాన్ని నాలుగేళ్ల కొకసారి ఫిబ్రవరి కి కలపాలనుకున్నారు . (లీపు సంవత్సరమన్నమాట) . ఇదే జూలియస్ క్యాలెండర్ .

అయితే సీజర్ తర్వాత క్యాలన్డర్ల రూపకర్తలు తప్పుగా అర్ధం చేసుకుని ముడేల్లకోసారే ఫిబ్రవరికి ఒకోరుజును కలిపేయడం మొదలెట్టారు . ఇది క్రీస్తుశకము 8 వరకు కొనసాగింది . దేన్నీ గమనించిన అగస్తస్ అనే చక్రవర్తి అంతవరకూ జరిగిన తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ళకు ఒకసారి ఒకరోను కలిపే పద్ధతిని ఆపించాడు . ఆ పై క్రీస్తుశకము 567 లో తిరిగి కొత్త సంవత్సరాన్ని మార్చి కి మార్చేశారు .

తర్వాత రోజుల్లో లెక్కలో కచ్చితత్వము పెరిగి ఏడాదికి " 365.242199 రోజులు గా గుర్తించారు . ఇందువల ఏడాదికి 11 నిముషాల 14 సెకనులు వంతున తేడా వస్తు క్రీస్తుశకం 1572 మచ్చేసరికి ఏకంగా 10 రోజుల పాటు క్యాలెండర్ లెక్క తప్పింది . దీన్ని " 13 వ పోప్ గ్రెగొరీ " సరిదిద్దించారు . అయిన ఏటా ౦.0078 రోజుల తేడా తప్పలేదు . అందువల్ల ప్రతి 400 ఏళ్ళకి లీపుసంవత్సరాని వదలివేయాలని నిర్ణయించారు . అందువల్లే 400 తో భాగించబడే శతాబ్ది సంవత్సరాలకే తీపు నిబంధన ఉండాలనే సవరింపు వచ్చింది . కాబట్టే 1700 , 1800 , 1900 , మామూలు సంవత్సరాలే .. 2000 మాత్రము లీపుసంవత్సరము .. అలాగే కొత్త సంవత్సరము జనవరి తో ప్రారంభ మవ్వాలని నిర్ణయించారు .

క్రీస్తుశకము 1582 లో అమలులోకి వచ్చిన ఈ గ్రెగోరియన్ క్యాలందరే ఇప్పటి మన క్యాలెండర్ కి నాంది .

హిందూ ధర్మాన్ని గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే ఇట్లా చెప్పవచ్చు!


* ఓం మాతృదేవో భవః

* ఓం పితృదేవో భవః

* ఓం ఆచార్యదేవో భవః

* ఓం అతిధిదేవో భవః

పై నాలుగు ధర్మాలు హిందూ ధర్మానికి మూల స్థంభాలు. ఈ నాలుగు ధర్మాలపైనే హిందూ జాతియొక్క నిర్మాణం జరిగిందని చెప్పటంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అమ్మా,నాన్నలను; గురువులను, అతిథిలను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో మన హిందూ శాస్త్రాలెన్నో కథల రూపంలో సవివరంగా చెప్పాయి.

శంఖంలో పోస్తేకానీ తీర్ధం కాదని నానుడి. అలాగే మొక్కై వంగనది మ్రానైవంగునా అనేదికూడా మరొక నానుడి. ఊహ తెలుస్తున్న వయసులో పిల్లల్లో శబ్దగ్రహణ శక్తి; విషయ గ్రహణ శక్తి; జ్ఞాపకశక్తి ఎక్కువగా వుంటుందని నాటి, నేటి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇదే విషయం ఆధారంగా, మంచి విషయాలను పిల్లలకు ఊహ తెలుస్తున్న వయస్సుల్లోనే ఉగ్గుపాలు పోసినట్ట్లుగా తెలియచేయాలని మన పూర్వీకులు నిర్ణయించారు.

మరి మన పూర్వీకులు పై విషయంలో ఏం చేసారు? సాధారణంగా మన ప్రపంచం పురుషాధిక్యత ప్రపంచం. స్త్రీకి రెండవ స్థానం ఇవ్వబడింది. ఇది సమసమాజానికి చేటు చేస్తుందని తెలిసే, మన పూర్వీకులు ప్రతి చోటా స్త్రీని మెదట స్థానంలో వుంచటానికి ప్రయత్నించారు. అందుకు మొదట ఉదాహరణే ‘ మాతృదేవో భవః ’ అని చెప్పటం. సీతారాములు; లక్ష్మీనారాయణులు; ప్రకృతి,పురుషుడు మరికొన్ని ఉదాహరణలు.

భూమి తనయొక్క ఆకర్షణచే ప్రతి జీవరాశిని తన అధీనంలో ఉంచుకుంటుంది (దీనివల్ల ఎన్నో సృష్టి లాభాలున్నాయి). భూమ్యాకర్షణలాగే, భౌతికమైన ఈ జగత్తులో, పుట్టుకతోనే ప్రతి జీవి, ముఖ్యంగా “ మనిషి ” తన జీవన మనుగడకోసం భౌతిక విషయాలపట్ల ఎక్కువగా ఆకర్షింపబడివుంటాడు. వాటి ఆకర్షణ వలలో పడిపోయి, తనయొక్క మూలాల్ని మరిచిపోతుంటాడు. ఒకానొక దశలో కేవలం ఒక మర మనిషిగా; సుఖాలకోసమే బ్రతకాలి అన్న ఒక్క మిషలో పడిపోతాడు. అప్పుడు సమాజం మిధ్యాలోకంలోనే కొట్టుమిట్టులాడుతూ వుంటుంది.

ఉగ్గుపాలు పోసినట్లుగా, మంచి విషయాలను పిల్లలకు చిన్నప్పుడే బోధించాలి అని పైన చెప్పుకున్నాంగదా. అందులోని భాగంగా, పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒక ‘మంత్రాన్ని’ మన పూర్వీకులు ఉపదేశించారు. అదే, “ ఓం నమఃశివాయః సిద్ధం నమః ” (అక్షరాభ్యాసం -అనే శీర్షికతో నాచే వ్రాయబడిన వ్యాసాన్నికూడా చదవగలరు). ఇంతకీ ఈ మంత్రానికీ, స్త్రీకి, పురుషునితో సమాన హోదా ఇవ్వటానికీ; మన హిందూ ధర్మానికీ ఏమిటి సంబంధం? అని సందేహం ఎవరికైనా రావచ్చు. మరి, మరికొంత ముందుకు చదవండి:

ఓం నమః = ఓం అంటే ప్రణవ నాదం; ఈ చైతన్య జగత్తుకు మూల నాదం; అటువంటి ప్రణవ నాదానికి నా నమస్కారములు అని మొదటగా ఆ చిన్న విద్యార్ధి చిలుక పలుకులు పలుకుతూ, మంత్రాన్ని వల్లె వేయటం మొదలుపెడతాడు.

శివాయః = ఈ పదం, ‘ శ్ + ఇ + వ్ + అ ’ అనే అక్షరాల కూర్పు. ‘ఇ’ = ఈ అక్షరం అమ్మ లేదా అమ్మవారిని సూచిస్తుంది; ‘అ’ = ఈ అక్షరం అయ్య లేదా అయ్యవారిని సూచిస్తుంది; భౌతికమైన ఈ జగత్తు నిర్మాణానికి ‘తల్లి, తండ్రు’లు మూలాలు. ఈ ఇద్దరి కలయికవలనే జగత్తు నిర్మాణం సాకారమవుతుంది. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా జగత్తు నిర్మాణం జరగదు. ‘శివ’ అనే పదం ‘శక్తి’ని సూచిస్తుంది. ఈ శక్తి అమ్మ, అయ్యవార్ల కలయిక వలననే జరుగుతుంది; ‘శ్+ఇ+వ్+అ’ ల అక్షరమాలలో ‘ఇ’ అక్షరం వున్నప్పుడే, ఆ పదం ‘శివ’ గా వుంటుంది; అందులోని ‘ఇ’ ని తీసివేస్తే, అది ‘శ్+వ్+అ’ = శవ అనే పదంగా మారుతుంది. అంటే, శివం, శవంగా మారిపోతుంది. శివం శక్తిమయం; శవం శక్తి హీనం. – కాబట్టి, అట్టి శక్తిమయమైన జగత్తుకు కారణభూతులైన అమ్మ, అయ్యవార్లకు, ఓం నమః = నమస్కరిస్తూ …

సిద్ధం నమః = అటువంటి జగత్ సృష్టికి మాతాపితలైన (లేదా నా పుట్టుకకు మూలకారణమైన నా తల్లి,తండ్రులకు ) వారియొక్క ఆశీస్సులు సదా నాకు ‘సిద్ధించాలి కోరుకుంటూ, నమస్కరిస్తున్నాను’….

అనే అర్ధంతో ఆ మంత్రాన్ని మన పెద్దలు మనకు ఊహ తెలియటం మొదలవుతుండగానే మననం చేయించారు. మొక్కగా వున్నప్పుడే మనసులో పడిన ఆ భావంయొక్క అర్ధం పెద్దయిన తరువాత మానుగా మనస్సులో నిలబడిపోయి, మన తల్లి,తండ్రులను గౌరవించటం, ప్రేమించటం, అలవాటు అవుతుందని చెప్పటంలో ఎటువంటి అనుమానం వుండనక్కరలేదు.

పై విషయాల్ని, ఆదిశంకరులు తమ ‘సౌందర్యలహరి’ లో మొట్టమొదటి శ్లోకం, “శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః” లో మనందరికీ తెలియచేసారని పండితులు తమతమ భాష్యాలలో మనకు చెప్పటం జరిగింది. మరి మన కర్తవ్యం ఆ మంత్రాన్ని మనం చేసి, చేస్తూ, చేయిస్తూ వుండటమే!! స్వస్తి.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles