Showing posts with label పాటలు. Show all posts
Showing posts with label పాటలు. Show all posts

Friday 13 January 2017

గోవిందా నామాలు భజన

1. అనాధరక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా
    అనంత రూప గోవిందా, ఆనందదాయక గోవిందా

2. అభిషేక ప్రియ గోవిందా, ఆపన్నివార  గోవిందా
    అలుపే తెలియని గోవిందా, ఆనందరూప గోవిందా

3. అరమరికలేని గోవిందా, ఆద్యమ్త రహితవు గోవిందా
    అర్ధాంగిని ఆదుకునే గోవిందా, ఆత్రత్రాణువు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద

4. ఆధ్రుతవు గోవిందా, ఆశ్రమ వాసవు గోవిందా
    అపరాజితవు గోవిందా, అభిప్రాయుడవు గోవిందా
              
5. ఆరోగ్య వంతువు గోవిందా, అక్షోభ్యుడవు గోవిందా
    అమ్రుతా శనుడవు గోవిందా,  అనిలుడవు గోవిందా

6. అశ్వథాముడవు గోవిందా, అనఘుడవు గోవిందా
    అచిమ్చుడవు గోవిందా, అగ్రజుడవు గోవిందా 
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద

7. ఆశ్చర్య భూతుడవు గోవిందా,
అకృరుడవు గోవిందా
    అరమరికలేనివాడవు గోవిందా,
అనంతైస్వరుడవు గోవిందా    

8. ఇహపర సుఖములిచ్చె గోవిందా,
ఇష్ట్తాన్ని ఇచ్చె గోవిందా
   ఇంత అని అనలేనంత ఇస్తున్నావు గోవిందా,
ఈశ్వర రూప గోవిందా

9. ఇరువురిమధ్య సఖ్యతవు గోవిందా, ఇహపరదాయకవు గోవిందా
    ఇటీవల ఆదుకున్నవాడవు గోవిందా,
ఇభరాజ రక్షకుడవు గోవిందా

10. ఇష్ట దేవుడవు గోవిందా,
ఇంటిల్లి పాటి అరాధకుడవు గోవిందా
     ఇలలో ఆరధకుడవు గోవిందా,
ఇప్పుడే సంపదలిచ్చేవు గోవిందా

11. ఉరవడి తగ్గించె వాడవు గోవిందా,
ఊయలలో ఊగేవాడవు గోవిందా
     ఉరుములవర్షం కురిపించేవాడవు గోవిందా, ఊరూరా ఊరేగింపే వాడవు గోవిందా
                
12. ఓనామాలు నేర్పేవాడవు గోవిందా,
ఓంకార స్వరూపుడవు గోవిందా
      ఓపికలేనివారిని ఓదార్చావు గోవిందా,
ఓర్వలేని తనం మార్చావు గోవిందా

13. ఓర్పుతో ఆరాధించిన వారిని కాపాడినవాడవు గోవిందా, ఓర్పే ఆయుధడవు గోవిందా 
      ఓపికను పరిక్షించి, రక్షించిన వాడవు గోవిందా, ఔదార్యము కలవాడవు గోవిందా

14. ఔషదము పంచేవు గోవిందా,
ఔను కాదు అని నిర్ధారించేవు గోవిందా
      ఔనత్యము కల్గించావు గోవిందా, ఔరా అనేవిధముగా మార్చావు  గోవిందా

15. కపిల వర్ణము కలవాడవు గోవిందా,
కపీంద్రుడవు గోవిందా
      కపిలా చార్యుడవు గోవిందా,
కామపాలకుడవు గోవిందా

16. కాలనిర్ణయాధి కుడవు గోవిందా,
కామ దేవుడవు గోవిందా
      కాలాన్ని గుర్తిమ్చేవాడవు గోవిందా,
కారడవుల్లో ఉన్నావు గోవిందా   

17. కష్టములు నివరించావు గోవిందా,
కామిత ఫల దాతవు గోవిందా
      కరుణాసాగరుడవు గోవిందా, కాంచనాంభరధరుడవు గోవిందా

18. కాంచనాంభరధరుడవు గోవిందా,
కస్తూరి తిలకం ఉన్నవాడవు గోవిందా
      కామ క్రుతుడవు గోవిందా,
కలలో కనిపించే గోవిందా 

19. కుందరుడవు గోవిందా,
కుముదుడవు గోవిందా
      కుండలీకుడవు గోవిందా,
కులములేని వాడవు గోవిందా

20. కురూపిని కాపాడు వాడవు గోవిందా,
కృష్ణను ఆదుకున్నవుగోవిందా  .
      కుంటి వారిని ఆదుకూన్నవాడవు గోవిందా, కర్మలేని వాడవు గోవిందా

21. కృతజ్ణుడవు గోవిందా, కృతగాముడవు గోవిందా
      కృష్ణుడవు గోవిందా, కృ తాక్రుతుడవు గోవిందా

22.  కృతకర్మా చారుడవు గోవిందా,
కృత గాముడవు గోవిందా
       కలిని తొలగించిన వాడవు గోవిందా,
కొర్కలు తీ ర్చావు గోవిందా

23. త్రివిక్రముడవు గోవిందా, త్రిపదుడవు గోవిందా
      త్రిదలాద్యక్షుడవు గోవిందా, త్రికాలజ్ఞుడవు గోవిందా

24. త్రిసాముడవు గోవిందా, త్రిలోకద్రుతుడవు గోవిందా
      త్రిలోక రక్షక గోవిందా, త్రినేత్ర గోవిందా        

25. చతుర్భుజుడవు గోవిందా,
చతుర్గతుడవు గోవిందా
      చతుర్భాహుడవు గోవిందా,
చతుర్మూర్తుడవు గోవిందా

26. చతురాత్ముడవు గోవిందా,
చతుర్భావకుడవు గోవిందా
      చతురతలను మార్చావు  గోవిందా,
చత్వారం తొలగించావు గోవిందా

27. దుర్జయుడవు గోవిందా, దురతిక్రముడవు గోవిందా
      దుర్లభుడవు గోవిందా, దుర్గముడవు గోవిందా

28. దురా వాసుడవు గోవిందా,
దురాక్రమను తొలగించవాడవు గోవిందా 
      దుర్మార్గాన్ని తొలగించేవాడవు గోవిందా,
దూర దృష్టి గలవాడవు గోవిందా 

29. ధర్మ సంస్థాపకుడవు గోవిందా,
దరిద్ర జన పొషకుడవు గోవిందా
      దశరధ నందనుడవు గోవిందా,
దశ ముఖ మర్ధనుడవు గోవిందా

30. దుష్ట సమ్హారణుడవు గోవిందా,
దురిత నివారుణుడవు గోవిందా
      దుష్టబుద్ధిని తొలగించే వాడవు గోవిందా, దుర్ధరుడవు గోవిందా,   

31. ధరణీ నాయకుడవు గోవిందా,
దక్షిణా పరుడవు గోవిందా
      ధర్మానుస్టాన పరుడవు గోవిందా,
ద్యుతిధరుడవు గోవిందా

32. నిత్య నిర్మలా కారుడవు గోవిందా,
నీల మెఘశ్యాముడవు గోవిందా
      నంద నందనుడవు గోవిందా,
నవనీత చోరుడవు గోవిందా

33. నిత్య శుభ ప్రదుడవు గోవిందా,
నిఖిల లోకేశ్వరుడవు గోవిందా
      నార సింహుడవు గోవిందా,
నారా యనుడవు గోవిందా

34. న్యాయ పరుడవు గోవిందా,
నేతలకు నేతవు గోవిందా
      నివృతా త్ముడవు గోవిందా,
నహుషుడవు గోవిందా

35. పద్మ నాభుడవు గోవిందా,
పరమాత్ముడవు గోవిందా
      ప్రజా భవుడవు గోవిందా,
పావనుడవు గోవిందా

36. ప్రతిష్టితుడవు గోవిందా,
పద్మ నిభేక్షుడవు గోవిందా
      పరకాయ ప్రవేసుడవు గోవిందా,
ప్రలోభాన్ని అనేచేవాడవు గోవిందా

37. గోహితుడవు గోవిందా, గోపతుడవు గోవిందా
      గోప్తుడవు గోవిందా, గోవిందుడవు గోవిందా

38. గోపాలుడవు గోవిందా,
గోపికా రక్షకుడవు గోవిందా
      గరుడ ధ్వజుడవు గోవిందా,
గోపీ జనలోలుడవు గోవిందా

39. గోవర్ధనో ధారకుడవు గోవిందా, గోకుల నందనుడవు గోవిందా
      గజరాజ రక్షకుడవు గోవిందా,
గుణ శీలుడవు గోవిందా

40. భక్త వచ్చలుడవు గోవిందా,
భాగవత ప్రియుడవు గోవిందా
      బ్రహ్మామ్డ రూపుడవు గోవిందా,
భక్త రక్షకుడవు గోవిందా

41. భూతాది పతుడవు గోవిందా,
భావనా పరుడవు గోవిందా
      భూత నాధుడవు గోవిందా,
భవనాదీ సుడవు గోవిందా   

42. పురాణ పురుషుడవు గోవిందా,
పుందరీ కాక్షుడవు గోవిందా
      ప్రత్యక్ష దేవుడవు గోవిందా,
పరమ దయాకరుడవు గోవిందా

43. పద్మ దలాక్షుడవు గోవిందా,
ప్రభువులకు ప్రభుడవు గోవిందా
      పవిత్రుడవు గోవిందా,
పరమాత్ముడవు గోవిందా

44. మధుసూధనుడవు గోవిందా,
మాధవుడవు గోవిందా
      మహా భాహుడవు గోవిందా,
మహా బలుడవు గోవిందా

45. మహా బుద్ది మంతుడవు గోవిందా,
మహా వీర్య వంతుడవు గోవిందా
      మహా శక్తి మంతుడవు గోవిందా,
మహా ద్యుతి మంతుడవు గోవిందా

46. మహీ భర్తవు గోవిందా,
మనో హరుడవు గోవిందా
      మహీదరుడవు గోవిందా,
మహా భాగ్య వంతుడవు గోవిందా

47. విస్వమునకు కారణభూతుడవు గోవిందా, విజయుడవు గోవిందా
      వ్యవస్తాపకుడవు గోవిందా,
వాసు దేవుడవు గోవిందా

48. వాయు వాహనుడవు గోవిందా,
వాస వానుజడవు గోవిందా
      వామన రూపుడవు గోవిందా, వారాలునావారినికాపాదేవాడవు గోవిందా

49  సద్గతుడవు గోవిందా, సజ్జన పాలకుడవు గోవిందా
      సత్కార్యుడవు గోవిందా, సద్భూతుడవు  గోవిందా

50. సత్యనారాయణుడవు గోవిందా,
సత్యసంకల్పుడవు గోవిందా
      సాధకులకు విశ్రాంతి ఇచ్చావు గోవిందా, సందేహములుతీర్చావు గోవిందా 

51. సమస్తభూతములకు నివాసుడవు గోవిందా, సహస్త్రప్రాణులను రక్షకుడవు  గోవిందా
      సంతతి కల్పించువాడవు గోవిందా, సమస్తరోగములను హరించు వాడవు గోవిందా

52. శ్రీ గర్భుడవు గోవిందా,
శ్రీ మంతుడవు గోవిందా
     శ్రీ నిధిగలవాడవు గోవిందా,
శ్రీ విద్యావంతుడవు గోవిందా

53. శ్రీ లక్ష్మీశ్వరూపుడవు గోవిందా,
శ్రీ వేంకటేశ్వరుడవు గోవిందా
      శ్రీ ధరుడవు గోవిందా,
శ్రీ కరుడవు గోవిందా

54. శ్రీ నిధికలవాడవు గోవిందా,
శ్రీ విభావనుడవు గోవిందా
      శ్రీనివాసుడవు గోవిందా,
గోవిందా శ్రీ హరి గోవిందా

55, లోకసారంగుడవు గోవిందా,
లోక నాయకుడవు గోవిందా
      లోకా ధీశుడవు గోవిందా,
లోకోత్తముడవు గోవిందా

56. లోక భందుడవు గోవిందా,
లోకేశ్వరుడవు గోవిందా
      లొకాలేలే వాడవు  గోవిందా, 
లోకనాయకుడవు గోవిందా  

57. విక్రముడవు గోవిందా,
వైకుంటాధీశుడవు గోవిందా
      వ్రుష కర్ముడవు  గోవిందా,
వరారోహుడవు గోవిందా

58. విష్వక్సేనుడవు గోవిందా,
వేద శరీరుడవు గోవిందా
      వరాలు ఇచ్చావాడవు గోవిందా,
వలపు పంచె వాడవు గోవిందా

59. సిరా నందుడవు గోవిందా,
సుందరుడవు గోవిందా
      సురారిహుడవు గోవిందా,
స్థిరము గలవాడవు గోవింద

60. సువర్నా భరుడవు గోవిందా,
సృష్టిలయ కారుడవు గోవిందా
      సత్య వంతుడవు గోవిందా,
సత్య పరాక్రముడవు గోవిందా

61. సహస్త్ర శిరస్సుడవు గోవిందా,
సహస్త్ర నేత్రుడవు గోవిందా
      సహస్త్ర పాదుడవు గోవిందా,
సుప్రసాదుడవు గోవిందా

62. సిద్ధార్ధుడవు గోవిందా,
సిద్ధి సంకల్పుడవు గోవిందా
      సిద్ధి సాధకుడవు గోవిందా,
సిద్ధులను రక్షకుడవు గోవిందా

63. సురేశ్వరుడవు గోవిందా, సహస్రజతుడవు గోవిందా
      సుఘోషుడవు గోవిందా, సుఖపరుడవు గోవిందా

64. స్వాపనుడవు గోవిందా,
స్వశనుడవు గోవిందా
      సత్య సంధుడవు గోవిందా,
సత్య పాలకుడవు గోవిందా

65. సుదర్శనుడవు గోవిందా,స్తావరస్తాణుడవు గోవిందా
     స్రవదర్శకుడవు గోవిందా, సర్వజ్ఞుడవు గోవిందా

66. సుముఖుడవు గోవిందా, సువ్రతుడవు గోవిందా
      వరదుడవు గోవిందా, వరమాలాకరుడవు గోవిందా

67. వ్రుద్ధాత్ముడవు గోవిందా,
వికారము పొందువాడవు గోవిందా
      వ్యవ సాయకుడవు గోవిందా,
వ్యవస్తానుడవు గోవింద

68. వారణుడవు గోవిందా,
వాచస్పతుడవు గోవిందా
      వ్రుషబాక్షుడవు గోవిందా,
వరము లిచ్చు వాడవు గోవిందా

69. జనేశ్వరుడవు గోవిందా, జగదీశ్వరుడవు గోవిందా
      జగత్స్సేతుడవు గోవిందా, జహ్నువుడవు గోవిందా

70. జగజ్జేతుడవు గోవిందా, జగదాదిజుడవు గోవిందా
      గోవిందా శ్రీ హరి గోవిందా, గోకుల నంద గోవిందా

71. అఖిల కారణాయ గోవిందా,
అఖిల పాలకాయ గోవిందా
      సుర నాయకాయ గోవిందా,
దైత్య విమర్ధనాయ గోవిందా

72. భాక్త జనప్రియాయ గోవిందా,
పాప విదారణాయ గోవిందా
      దుర్జన నాశకాయ గోవిందా,
తస్మై జగదీశ్వరాయ గోవిందా

Tuesday 3 January 2017

పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?


కల్యాణ గ్రహం

 సీజన్అందం.... ఆదాయం...
వంశం... వారసత్వం....
గుణం... గోత్రం...
వీటన్నింటికీ లెక్కలుంటాయి.
ఆ లెక్కలు సరిపోవు.
గ్రహం, రాశి, నక్షత్రం, ముహూర్తం....
ఈ లెక్కలు కూడా తేలాలట.
అవునంటారా? కాదంటారా?

మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.

వివాహానికి వధూవరుల జాతకాలలో పొంతన అవసరమా? పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?
ప్రపంచంలోని మిగతా దేశాలలో, మిగతా మతాల వారు జాతకాలు పట్టించుకోవడం లేదు కదా. అక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా. మరి హిందూ ధర్మంలోనే ఎందుకు? ఏయే జాతకాల అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఎవరెవరికి వద్దని శాస్త్రం చెబుతోంది?

ఇవి తరచూ తలెత్తే ప్రశ్నలు. కాని  అందమైన జీవితం కావాలంటే  జాతకాలు చూసుకోవాలి అంటున్నారు జ్యోతిష్యులు. వివాహానికి వధూవరుల జీవితాలలో పొంతన కుదరాలంటున్నారు. జాతకాలు కలిస్తే వారు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటున్నారు. వివాహాది శుభకార్యాలకు పునాది అయిన శ్రావణ మాసం మొదలు కానున్న సందర్భంగా ఈ విషయమై ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సెమినార్ కూడా నిర్వహించారు జ్యోతిష్య పండితులు. ఇంటా బయటా కొన్ని అభిప్రాయాలు...

కనీసం అరవై శాతం కలవాలి....
భూమి మీద ఉన్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని శాస్త్రాలు, సైన్సు అంగీకరించాయి. దీనిని కాదనడానికి లేదు. ఉదాహరణకు చూడండి. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి. కాని అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తాం. కారణం ఈ జాతక దోషాలే. వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలి. జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాసులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు,  వాటి మైత్రి... ఇలా అన్ని విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అని వివాహం నిర్ణయించాలి. విదేశాలలో, మన దేశంలో జాతకాలు చూడకుండా చేసుకున్న వివాహాలు జయప్రదంగా ఉన్నాయంటే అది పూర్వజన్మ సుకృతం. లేక కాకతాళీయంగా జాతకాలు కలిసే ఉంటాయి. నా అనుభవంలో ఇలాంటివి చాలా చూశాను.
            - గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష పండితులు

జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం
నవగ్రహాల ప్రభావం మన జీవితంలో 12 కోణాలుగా ఉంటుందని, జన్మించిన సమయంలో ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, మన జీవితంలో మంచిచెడులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రం సాధికారికంగా చెబుతోంది. కాబట్టి ఆ శాస్త్ర నియమాలను జీవితంలో ప్రధాన ఘట్టమైన వివాహానికి కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. భారత ఉపఖండంలో పుట్టి పెరిగేవారి కోసం ఇక్కడ భూమి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాలను, డిగ్రీలను బట్టి, ఫలితాలను నిర్ణయించే శాస్త్రం ఏర్పడింది. మనలాగే గ్రీకు దేశంలో జ్యోతిషం ఉంది. మన రాసులను వారు వేరు వేరు పేర్లతో పిలుస్తారు. జాతకాలు చూసేటప్పుడు నక్షత్రాలు ప్రధానం. ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుట్టారనేదాన్ని బట్టి చూస్తారు. అంటే అవతల వ్యక్తి గురించి ప్రాథమిక సమాచారం సేకరించడమన్నమాట. ఏ లగ్నంలో పుట్టారో, ఆ గ్రహం నుంచి లెక్కించాలి. జాతకాలు చూడకుండా వివాహం చేసినా కలసి జీవించవచ్చు. కోడి కూసినా కూయకపోయినా తెల్లవారుతుంది. అయితే కూసినప్పుడు లేవాలి అనుకుంటే, సరైన సమయంలో మేల్కొంటాం. లేదంటే ముందుగా కాని, ఆలస్యంగా కాని మేల్కొంటాం. జాతకం కూడా అంతే. జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం.
          - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పండితులు

శని ఉప్పు.... కుజుడు నిప్పు...
జ్యోతిష్యం హిందూధర్మం మాత్రానికే అని ఎవరన్నారు? అది ప్రపంచమంతా ఉంది. అరేబియన్లు, గ్రీకులు, చైనీయులు అందరూ నమ్ముతారు. అక్కడ కూడా జాతకాల మీద పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. యజమాని ఒక ఉద్యోగిని తీసుకునేటప్పుడు ఆ ఉద్యోగి తనకు అనుకూలుడో కాదో అని తెలుసుకోవడానికి కూడా జాతకం చూస్తారు. ఒక స్నేహితుడు మనకు తగినవాడా కాదా, ఒక ఊరు మనం నివసించడానికి యోగ్యమా కాదా అని చూస్తారు. కొడుకు జన్మించినప్పుడు వాడు శత్రువు అవుతాడా, మిత్రుడిలా ఉంటాడా అనే విషయం కూడా జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. నక్షత్రాలకు రాసులకు స్వభావం ఉంది. ఏ నక్షత్రానికి, ఏ నక్షత్రం సరిపడుతుందో చూసుకోవాలి. ఏ రాశిలో పుట్టినవారికి ఏ రాశివారితో సరిపోలుతుందో చూసుకోవాలి. శని ఉప్పులాంటివాడు. కుజుడు నిప్పు లాంటివాడు. ఉప్పు నిప్పు కలిస్తే మంట పెరుగుతుంది. గురువు చంద్రుడు ఒకచోట చేరితే సంతోషం, ఆనందం ఉంటాయి. కొన్ని నక్షత్రాలకు కొన్ని నక్షత్రాలే కలుస్తాయి. అగ్నితత్త్వం వారికి జల తత్త్వం వారితో పొంతన కుదరదు. ఒకరు ఊసురోమంటూ ఉంటే ఒకరు ఎగిరెగిరిపడుతుంటారు. మ్యాచింగ్‌లో ఇవన్నీ చూస్తాం. కనుక ఒక జంటకు వివాహం చేసేటప్పుడు ఆ ఇద్దరూ కలిసి జీవించగలిగే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి.
                 - భీమా సాంబశివరావు, జ్యోతిష పండితులు

కుజదోషం వల్ల ఇబ్బంది ఉంటుంది....

మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.   జ్యోతిష్యం అంటే గమనంలో ఉన్న ముళ్లను ఏరుకుంటూ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే దిక్సూచి. గతంలో పన్నెండేళ్లు నిండకుండానే వివాహాలు చేసేవారు. అందువల్ల నక్షత్రాలు చూసేవారు. మఖ మామగారికి, జ్యేష్ఠ బావగారికి, ఆశ్లేష అత్తగారికి గండం అనేవారు. ఇప్పుడు పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తరవాత చేస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్రాల ప్రస్తావన అనవసరం. నక్షత్రాలకు పరిష్కారం ఉంది, గ్రహాలకు లేదు. కుజుడు అగ్ని తత్త్వ కారకుడు. వివాహాన్ని పాడు చేయడానికి చూస్తాడు. దోషపరిహారం ఎంతవరకు ఉన్నదో చూడాలి. కుజదోషం వల్ల వియోగం, విరహం, కలహం కలుగుతాయి. కొందరు సమాజం కోసం కలిసే ఉంటారు. కాని వారి వైవాహిక జీవితం సరిగా ఉండదు. కొందరిలో మాత్రం సంతానం కలిగితే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబం బలపడుతుంది.  ఎవరి జాతకం వారు చూసుకోకుండా ఇంటికి రాబోయే అమ్మాయి జాతకం చూడటం సరికాదు. నక్షత్రాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, గ్రహాల అనుకూలత చక్కగా చూసుకోవాలి
    - విశ్వనాథ కనకమహాలక్ష్మి, జ్యోతిష, వాస్తు నిపుణులు

జీవి పుట్టుక ఏది?
జాతకాలన్నీ పుట్టిన తేదీ, సమయం ఆధారంగా రూపొందుతాయి. అయితే జీవి ఆవిర్భావం ఎప్పుడు? తల్లి గర్భంలో అండం- శుక్రకణాలు ఫలదీకరణ చెందినప్పుడే మనిషి జీవం మొదలవుతుంది. అదే అసలైన పుట్టుక. తల్లి గర్భం నుంచి బయటపడడం అనేది కొనసాగింపు మాత్రమే. జీవం ఎప్పుడు మొదలైందనేది రెండు-మూడు రోజుల తేడాలో ఒక అంచనాకు రావచ్చు. కానీ కచ్చితమైన సమయాన్ని చెప్పలేం. అలాంటప్పుడు జాతకాలు రాయడానికి ఏది ఆధారం? ఇప్పుడు ఎక్కువ డెలివరీలు సిజేరియన్‌లే. అది కూడా ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్‌లు చేయించుకుంటున్నారు. అలా పుట్టిన బిడ్డ జాతకం కచ్చితంగా బాగుండి తీరాలి కదా! అలాగే జరుగుతోందా? నవగ్రహాల ఆధారంగా జాతకాన్ని నిర్ణయిస్తారు. మరి సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు నీడలు. నాలుగు పోగా మిగిలినవి ఎన్ని? మరి నవగ్రహాలనే మాటకు తావెక్కడ? అయితే ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి మనోభావాలనూ గాయ పరచకూడదు. మన రాజ్యాంగం కూడా నమ్మకాలను ఆమోదిస్తోంది. నేను చెప్పే మరో విషయం  ఏమిటంటే... పెళ్లి చేసుకునే అబ్బాయి తన జాతకం మంచిదనే నమ్మకంతో ఉండడం తప్పుకాదు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని జాతకం కలవలేదని నిరాకరించవద్దు. జాతకం కలిసిందని ఇష్టం లేని అమ్మాయిని చేసుకోవద్దు. అన్ని రోజులు దేవుడు సృష్టించినవే అయినప్పుడు కొన్ని  మంచివి, కొన్ని  చెడ్డవి ఎందుకుంటాయి? అన్నీ మంచిరోజులే.
                 - డాక్టర్ బ్రహ్మారెడ్డి, జనవిజ్ఞానవేదిక స్థాపకులు

పంచభూతాలతో కనెక్షన్
జాతకమనేది ఫిజికల్ ఫిట్‌నెస్‌ని చూపుతుంది. ఇద్దరిలో ఎలాంటి పాజిటివ్, నెగిటివ్‌లు ఉన్నాయో చెబుతుంది. సంతానం కూడా తెలుస్తుంది. లోపాలు పసిగట్టవచ్చు. ఇగో ప్రాబ్లమ్స్ కూడా చూడవచ్చు. జాతకమంటే ప్రకృతి. ఒకరికి నీరు పడుతుంది, ఒకరికి ఎండ పడుతుంది. నీళ్లు జల్లితే అగ్ని ఆరుతుంది. అవే నీళ్లను అగ్ని మీద పెడితే సలసల మరిగి ఆవిరవుతాయి. పంచభూతాలకి, శరీర నిర్మాణానికి ఉన్న కనెక్షన్ జ్యోతిష్యం. హెచ్చుతగ్గులను ఎలా సవరించుకుని, పాటించాలో చెబుతుంది. చైనీయులు న్యూమరాలజీ నమ్ముతారు. అమెరికన్లు పుట్టినతేదీని ఆధారంగా చేసుకుని వివాహాలు నిశ్చయిస్తారు. వారు మనసుకి ప్రాధాన్యత ఇవ్వరు. శరీరాకృతి, ఆకర్షణలకు ప్రాధాన్యం ఇస్తారు.  మనదేశంలో అలా కాదు. మంచి కుటుంబమా కాదా అని చూస్తారు. ఇంటిపేరుని బట్టి సంబంధాలు నిశ్చయించుకుంటారు. కనుక శాస్త్రాన్ని పాటించడంలో తప్పులేదు.
                            --ఉషా అన్నపూర్ణ (ఎం.ఏ ఆస్ట్రాలజీ)

Saturday 31 December 2016

మంగళసూత్రం’వెనుక దాగి ఉన్న శాస్త్రీయమైన కారణాలు.



హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
" మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! "


భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం రెండు కుటుంబాలు, రెండు దేహాల కలయిక కానే కాదు, అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన శక్తి సంబంధిత అనుకూలత ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పుడే వివాహాన్ని నిశ్చయించే వారు. చాలా సార్లు అసలు వివాహం చేసుకోబోతున్న ఇరువురు ఒకరినొకరు పెళ్లి రోజు దాకా చూసుకునే సందర్భం కూడా ఉండేది కాదు. అయినా అది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే వారి మధ్య సయోధ్యను కుదిర్చిన వారు, ఆ జంట కంటే ఆ విషయం బాగా తెలిసిన వారు. వధూవరుల వివాహ సమయానికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసేవారు.
 

‘మంగళ సూత్రం' అనగా పవిత్రమైన సూత్రం'(దారం). ఈ పవిత్రమైన సూత్రాన్ని తయారుచేయటం విస్తృతమైన శాస్త్రం. కొన్ని వడికిన నూలు దారాలను తీసుకొని, పసుపు కుంకుమలు రాసి ఒక పద్దతిలో శక్తిమంతం చేస్తారు. ఒకసారి ముడి వేస్తే ఈ జీవితానికే కాక ఆపైన కూడా నిలిచి ఉండేలా మంగళ సూత్రం తయారుచేసే వారు. ఆ ఇద్దరిని కలిపి ముడి వేసుందుకు వారు వినియోగించిన విధానాలు కేవలం భౌతిక, మానసిక స్థాయిలోనే కాక వారి నాడులు కూడా కలిపి ముడి వేయటం వల్ల అదే జంట అనేక జీవితాల పర్యంతం అలా కలిసి ఉంటుంది.
 
భౌతికమైన, మానసిక, భావావేశ స్థాయిల్లో చేసేది ఏదైనా మరణంతో పూర్తి అయి పోతుంది. కానీ శక్తి స్థాయిలో చేసేది శాశ్వతంగా మిగులుతుంది. ఎంతో గాఢంగా, మన అవగాహనకు అందని విధంగా ఎలా ముడి వేయాలో తెలిసిన వారిచే ముడి వేయటం వల్ల ఆ బంధం గురించి పునరాలోచన చేసే ప్రశ్నే లేదు. ఇదే క్రతువు ఈనాడూ జరుగుతున్నా ఏమీ తెలియని వారిచేత జరుపుతున్నారు. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోవటం వల్ల అది నిరర్ధకం. ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడేటపుడు, వారు కేవలం భావోద్వేగపరంగానే మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు నేడొకటి చెపితే రేపొకటి చెప్తాయి. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండక్కరల్లేని పరిస్థితి వచ్చింది.
 

వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షలు చెబుతారు. ఆధ్మాత్మిక, సాంఘీక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పట్టిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్ధేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఈ ప్రమాణాలను త్రికరణ శుద్దిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. ఆ సంబంధం నిండునూరేళ్ళు పవిత్రంగా పచ్చగా ఉంటుంది.
 
వివాహ తంతులో మాంగల్య ధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాలి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం పలురూపాల్లో ఉంటాయి. మానవులకు మనువాడం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. పెళ్లికోసం సమకూర్చుకున్న, ఇవచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులు, ఆభరణాలు అన్నీ రూపాంతరం చెందినా చివరి వరకూ వెంట ఉండేది తాళిబొట్టు మాత్రమే. 🙏🌺🙏

Wednesday 28 December 2016

శివతాండవస్తోత్రం

Shivtandav


జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || ౧ ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨ ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || ౩ ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || ౪ ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || ౫ ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || ౬ ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || ౭ ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || ౮ ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || ౯ ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || ౧౦ ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || ౧౧ ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || ౧౨ ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || ౧౩ ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || ౧౪ ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || ౧౫ ||

Friday 2 December 2016

నేటి యువత.....!

నేటి యువత.....!
youth

కాలంతో పోటీ పడే వేగంతో ఒకవైపు
కాలానికి విలువివ్వని సమరితనంతో మరోవైపు
అనుకున్నది సాధించే తెగువ ఒకవైపు
లక్ష్యం లేని జీవనం మరోవైపు
కుటుంబ భాద్యతలతో సంతోషం ఒకవైపు
ఒంటరితనపు వైరాగ్యం మరోవైపు
మదిలో ఆనందం ఒకవైపు
“మధిర”లోనే ఆనందం మరోవైపు
స్నేహానికి విలువతో ఒకవైపు
నమ్మక ద్రోహం నయవంచన మరోవైపు
సాగాల్సిన పయనం పక్కన పెట్టి
మధ్యం మత్తులో మాదకద్రవ్యాల చిత్తులో
మ్రగ్గిపోతున్న యువతా మేలుకో
||సోమ సుందర్ నిమ్మరాజు ||

Sunday 27 November 2016

పండరినాదా విఠలా



తుకారాం  ఆత్మానుభూతి  పొందిన           
         పాండురంగ  నామ మహత్వం

పాండురంగ విఠలే హరినారాయణ
పురందర విఠలే హరినారాయణ
హరినారాయణ బజే నారాయణ
శ్రీ మన్  నారా యణ సత్యనారాయణ

తుకారాం  ఆత్మానుభూతి  పొందిన
మహాత్ముడు  ,  ఆయన అటు  భగవంతునకి
ఇటు  జనులకు  సేవలందిస్తూ  వచ్చాడు  ...

భగవన్నామ. మహత్వాన్ని  ఆయన. తన
జీవితంలో  పలుమార్లు  నిరూపించి చూపించాడు  , అటువంటి  ఒక సంఘటనను
చూద్దాం  .....

ఒక. రోజు  ఇరుగు పొరుగు  ఇళ్ళలోని  ఇద్దరు
స్త్రీల. మధ్య. ప్రారంభమైన కలహం  చిలికి
చిలికి  గాలివాన. అయినట్లు  ఉగ్రరూపం
దాల్చింది  ,  ఆ. స్త్రీలు  ఇద్దరు  కలిపి ఒకే చోట
పిడకలు  తట్టారు  , ఎండిన. తరువాత. అవి
ఒకటితో  ఒకటి  కలిసిపోయాయి  , ఎవరివి
ఎన్ని  అని తెలుసుకోవాడానికి  సాధ్యంకాక
కలహించుకోసాగారు  ,......

తుకారాం  అప్పుడు  ఆ దారి  గుండా  పోతున్నాడు  , ఆయన. విషయం  విన్న. తర్వాత
పిడకలను  విభజించి  ఇస్తానని  చెప్పాడు  ,..
ఎండిన. అన్ని  పిడకలనూ  ఆయన. ముందు
గుమ్మరించారు  ,

ఆయన. ఒక్కొక్క. పిడకగా  తీసి   చెవి  వద్ద.
పెట్టుకొని  చూసి  , వాటిని  రెండు  భాగాలుగా
విభజించాడు  , ఆ. తరువాత. 
"  అమ్మా  !  మీ ఇద్దరిలో  ఎవరు  పిడకలు 
తట్టుతున్నప్పుడు    "  విఠల్   "  విఠల్   ,
అని  చెబుతూ  వచ్చారు  ?  అని
ప్రశ్నించాడు  ,....

నామం   ఉచ్చరిస్తూ   పిడకలు  తట్టిన. స్త్రీ 
ముందుకు  వచ్చింది  ,....
అమ్మా  !  ఎడం  వైపు  ఉన్న. పిడకల. గుట్ట
నీది  ,  కుడివైపుది  ఆమెది  ""   అని తుకారాంచెప్పాడు   , ....

ఈ. విడ్డూరం  చూడడానికి  వచ్చిన వారు
" స్వామి   ఇదేమిటి  ? .. అని   ఆశ్చర్యపోతు
అడిగారు  ,...

" మనం  భగవన్నామం  ఉచ్చరిస్తున్నప్పుడు  ,
నామ. తరంగాలు  చుట్టు ప్రక్కలంతా
వ్యాప్తిస్తాయి  ,  నామ. ప్రతిధ్వనులు  ఈ
పిడకల్లో  నెలకొని   ఉన్నాయి  ,  అవి  విని
వాటిని  విభజింప.  గలిగాను  "  అని  తుకారాం వివరించి  చెప్పాడు  ,....

నామ జపానికి  చోటు  , సమయం 
చూడవలసిన. అవసరంలేదు  , నామజపం 
మనకు  శ్రేయోదాయకమేకాక. ,  చుట్టూ 
వాతావరణాన్ని  కూడా  పవిత్రం  చేస్తుంది  ,

     
           
      పండరినాదా విఠలా పాండురంగ విఠలా
        పాండురంగ విఠలాపండరినాధ విఠలా!

Monday 23 May 2016

చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే... అస్త్రాలు.

Beautiful lines from Mahaa Kavi Sri Sri,
Motivate Your Self.
కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   
తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,
లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...
నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,
నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,
నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,
మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..
*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles